కీర్తి సురేష్‌కి ఇది అవసరమా?

కీర్తి సురేష్‌కి ఇది అవసరమా?

సావిత్రి బయోపిక్‌లో సావిత్రిగా కనిపించి 'మహానటి'గా అందరి మన్ననలు అందుకున్న కీర్తి సురేష్‌ ఇప్పుడో మరో బయోపిక్‌లో నటిస్తోంది. అయితే ఆ బయోపిక్‌లో ఆమెది లీడ్‌ రోల్‌ కాదు. ఆ బయోపిక్‌ ఒక దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ది అయితే అందులో అతని భార్యగా కీర్తి సురేష్‌ నటించనుంది.

సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ అనే ఫుట్‌బాల్‌ కోచ్‌ జీవిత కథతో అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కీర్తి సురేష్‌ కథానాయికగా ఎంపికయింది. ఫుట్‌బాల్‌ కోచ్‌ కథలో హీరోయిన్‌ రోల్‌ ఏమాత్రం వుంటుందనేది ఊహించవచ్చు. బాలీవుడ్‌లో పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని కీర్తి సురేష్‌ ఈ చిత్రాన్ని ఓకే చేసి వుండొచ్చు. అయితే ఆమెకిది ఏమైనా హెల్ప్‌ అవుతుందా?

హీరోయిన్‌ పాత్రకి అంతగా ప్రాధాన్యం వుండదు కనుకే బాలీవుడ్‌ ఏ లిస్ట్‌ హీరోయిన్లని కాకుండా కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకున్నారు. దక్షిణాది మార్కెట్లలో ఆమె వల్ల సినిమాకి కాస్త అడ్వాంటేజ్‌ వుంటుందని భావిస్తున్నారు. అయితే మహానటి తర్వాత తెలుగులో ఒక గొప్ప క్యారెక్టర్‌ వస్తే తప్ప చేయనని భీష్మించుకుని కూర్చున్న కీర్తి అటు తమిళంలో ప్రాధాన్యం లేని పాత్రలతోనే కాలక్షేపం చేస్తోంది.

ఇప్పుడు హిందీలోను అలాంటి పాత్రకే ఓకే చెప్పేసింది. కానీ తెలుగులో మాత్రం ఇంకా మహానటి ఇమేజ్‌ కంటిన్యూ అవుతుందని భావిస్తోంది. ఆమె చేస్తోన్న ఇతర సినిమాలని తెలుగు సినీ ప్రేక్షకులు చూస్తూనే వున్నారని ఆమె మరచిపోతోందా ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English