కథలన్నీ అల్లువారింటికే వెళ్తున్నాయే

కథలన్నీ అల్లువారింటికే వెళ్తున్నాయే

ఎక్కడ ఏ మంచి కథ విన్నా.. దానికి సరిపోయే హీరోను సజెస్ట్ చేసి.. ఆ సినిమాను మెటీరియలైజ్ చేయించే ప్రముఖులు కొందరు ఉన్నారు. కోన వెంకట్ ఆ కోవకు చెందినవాడే. కాని అలాంటి సెలబ్రిటీలు ఇప్పుడు ఇతర పనుల్లో బిజీ అయిపోవడంతో, మంచి కథలు దానికి సరిపడే హీరోలను వెతుక్కోవడంతో కాస్త ఇబ్బందుపడుతున్నాయట. కాని ఇప్పుడు ఆ లోటు తీరుతోందా? అంటే అవుననే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు.

దాదాపు ఇండస్ర్టీలో పుట్టుకొచ్చే ప్రతీ కొత్త కథకూ ఇప్పుడు అల్లూవారి గీతా ఆర్ట్స్ కొత్త కేరాఫ్‌ అడ్రస్సుగా మారిందట. ఇతర హీరోలకు కథలు చెప్పి.. ఆ హీరోలకు అవి నచ్చకపోవడంతో కాస్త హర్టయిన డైరక్టర్లందరూ కూడా ఇప్పుడు అల్లు అరవింద్ ను కలుస్తున్నారట. ఈ మధ్యన చాలామంది యంగ్ డైరక్టర్లు, అలాగే హిట్లు లేక బాధపడుతున్న యంగ్ డైరక్టర్లూ, అందరూ కూడా గీతావారితో గోవిందం అంటున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, దశరథ్, విరించి వర్మ, గోపిచంద్ మలినేని.. ఇలా చాలామంది దర్శకులు ఇప్పుడు అక్కడ స్టోరీలు చెబుతున్నారు. వాటిల్లో ఎన్ని పట్టాలెక్కుతాయో తెలియదు కాని.. ఆ కథలో మ్యాటర్ ఉంటే మాత్రం.. అల్లువారూ వాటిని లాగేసి తమ పాకెట్లో పెట్టేసుకుంటున్నారని టాక్.

విషయం ఏంటంటే.. ఎంతోమంది హీరోలకు ఇప్పుడు బాలీవుడ్లో కరణ్‌ జోహార్ టైపులో మన టాలీవుడ్లో అల్లు అరవింద్ ఒక మార్గదర్శి అయిపోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. చూద్దాం ఎవరెవరు ఈ ఆఫర్ ను వాడుకుంటారో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English