డబ్బులు కావాలంటే వెయిట్ చెయ్ వర్మ

డబ్బులు కావాలంటే వెయిట్ చెయ్ వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్.. సినిమాతో ప్రభంజనం అంటూ రామ్ గోపాల్ వర్మ తెగ ప్రచారం చేస్తున్నాడు. మరోవైపు సినిమాను రిలీజ్ కాకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయ్ అంటూ బాధపడుతున్నాడు. చంద్రబాబును కించపరిచే విధంగా సినిమాలో చూపించానంటూ నాపై కొంతమంది ఎలక్షన్ కమీషన్ కు కంప్లయింట్ ఇస్తున్నారు అంటూ వాపోయాడు. అంతా బాగానే ఉంది కాని.. వర్మ ఒక పాయింట్ మర్చిపోయాడు.

అసలు ఎలక్షన్ కు ముందే ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని రూల్ ఏమీ లేదు. బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్ నే జనాలు చూడలేదు అంటే.. ఇక వర్మ తీసిన బయోపిక్ ను తెగ చూస్తారని గ్యారంటీయే లేదు. కాబట్టి ఎలక్షన్ ముందుకు రిలీజ్ చేసి.. తేదేపాను ఏదో చేసేద్దాం అనుకోవడం వర్మ రాసుకున్న కామెడీ సీన్ లా ఉంది. నిజానికి సినిమాకు చక్కటి ఓపెనింగ్స్ రావాలంటే.. ఏప్రియల్ 11 వరకు వెయిట్ చేసి.. తరువాత రిలీజ్ చేసుకుంటే బెటర్. అప్పుడు కూడా.. ఇన్నాళ్ళూ టిడిపి వాళ్ళు ఈ సినిమాను ఎందుకు ఆపేశారబ్బా అనే కుతూహలం జనాల్లో ఉండే ఛాన్సుంది.

మరి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మాంచి డబ్బులు రావాలి కాబట్టి వర్మ వెయిట్ చేస్తాడా? లేదంటే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ కు సంబంధించిన జనాభా కాబట్టి, రిలీజ్ కోసం యుద్దం చేస్తాడా? లెటజ్ సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English