మహర్షి.. దిల్ రాజు.. లాజిక్ దెబ్బతినేసింది

మహర్షి.. దిల్ రాజు.. లాజిక్ దెబ్బతినేసింది

మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్లో దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందుతున్న సినిమా మహర్షి. అయితే ఏప్రియల్ 25న వస్తుందునుకున్న ఈ సినిమా ఇప్పుడు మే 9కి పోస్టుపోన్ అయ్యింది. అందుకు దిల్ ఒక రీజన్ కూడా చెప్పారు. కాని ఇప్పుడు ఆయన చెప్పిన లాజిక్ మొత్తం దెబ్బతినేసింది. సో ఇప్పుడు మరోసారి మహర్షి రిలీజ్ డేట్ మారుతోందా అనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి రాజుగారు చెప్పిన ఆ లాజిక్ ఏంటంటే.. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి.. ఆ తతంగం అయిపోయాక సినిమాను రిలీజ్ చేస్తే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే ఛాన్సుంటుంది అని మహర్షి టీమ్ పీలయ్యారట. అందుకే మనోళ్ళు ఏప్రియల్ 25న రిలీజవ్వాల్సిన సినిమాను ఏకంగా మే 9 నాటికి పోస్ట్ పోన్ చేశారు. కాని ఇప్పుడు ఎలక్షన్స్ ఏప్రియల్ 11నే జరుగుతుంటే.. రిజల్ట్స్ మాత్రం మే 23న రానున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే 25న సినిమా రిలీజ్ చేస్తే బాగానే ఉండేది. మహా అయితే మే 23న కాస్త కలక్షన్లు తగ్గేవి. కాని అప్పటికే సినిమా మ్యాగ్జిమం వసూలు చేసుండేది. సో ఇప్పుడు మహర్షి ఏం చేయబోతున్నాడు?

ఎలక్షన్ డేట్ మారింది కాబట్టి, మహర్షి ముందుకొస్తాడా? లేదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మే 9న వస్తాడా? లేదా ఎలక్షన్లన్నీ అయిపోయాక జనాలు ఇంకా ఫ్రీ అవుతారని మే 23 తరువాత వచ్చేలా మళ్ళీ పోస్టుపోన్ చేస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English