హీరో ఫ్యామిలీ అంతా వీక్ అయితే ఎలా?

హీరో ఫ్యామిలీ అంతా వీక్ అయితే ఎలా?

ప్రస్తుతం ప్రపంచంలో అందరూ ఎక్కువగా అటెండ్ అవుతున్న కోర్స్ ఏంటంటే.. మెంటల్ డిప్రెషన్ మరియు ఎమోషనల్ బ్యాలెన్స్.. అనే సబ్జెక్టే. ఎందుకంటే మనం ప్రతీ విషయానికి ఫీలైపోవడం, టెన్షన్ పడటం, బాధపడటం.. వగైరా వగైరా యవ్వారాలతో మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. అదిగో ఆ హీరో అండ్ ఫ్యామిలీని  చూశాక చెప్పాల్సిందే.

మొన్న జరిగిన 'మా' ఎన్నికల్లో.. హీరో రాజశేఖర్ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచాడు. అయితే ఆ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తూ తనకు గెలుస్తానా లేదా అని చాలా టెన్షన్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. అదంతా ఒకెత్తయితే.. మనోడు కౌంటింగ్ జరిపి విజేతలను తెలియజేస్తున్న సమయంలో.. తన పేరు చెప్పగానే.. ఒక్కసారిగా ఏడ్చేశాడు. అంతేకాదు.. ఆయన పక్కనే ఉన్న ఆయన కూతుళ్ళు కూడా కళ్ళమ్మెట నీళ్ళు పెట్టేసుకున్నారు. సరే ఇదొక విజయం కాబట్టి ఆనందబాష్పాలు వచ్చాయిలే అనుకోవచ్చు కాని, నిజానికి ఈ 'మా' పదవి గెలిచినందుకు అంతా ఫీలవుతారా అనే సందేహం ఎవ్వరికైనా వస్తుంది. దీనికే ఇలా స్పందిస్తే ఒకవేళ ఓడిపోతే సీన్ ఎలా ఉండేదో అనే సందేహం కూడా వచ్చేస్తుంది.

చూస్తుంటే మన హీరో ఫ్యామిలీ అంతా బాగా ఎమోషనల్ అని అర్ధమవుతోంది. రేపెప్పుడో పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడి ఎమ్మెల్యేగా గెలవలేక ఓడిపోతే.. వీరు తట్టుకోగలుగుతారా? మరీ ఇంత వీకైతే ఎలా సారూ??

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English