మొన్న చిరు.. నిన్న నితిన్.. నేడు దేవరకొండ

మొన్న చిరు.. నిన్న నితిన్.. నేడు దేవరకొండ

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయం నిజమే అని తేలింది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా కన్ఫమ్ అయింది. కోలీవుడ్‌కు చెందిన కొత్త దర్శకుడు ఆనంద్ అన్నామలైతో అతను తన కొత్త సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం విజయ్‌తో ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నిర్మిస్తున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది.

‘డియర్ కామ్రేడ్’ సినిమాను దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన మైత్రీ సంస్థ.. అదే తరహాలోనే దీన్ని కూడా దీన్ని కూడా తెరకెక్కించనుంది. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ కూడా ఖరారు చేసింది. ఏప్రిల్ 22న ఢిల్లీలో ‘హీరో’ షూటింగ్ మొదలవుతుందని ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్.

‘హీరో’ టైటిల్‌తో గతంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది పెద్ద హిట్టే. ఇక ఈ తరంలో నితిన్ ‘హీరో’ టైటిల్‌తో సినిమా చేశాడు. నటుడు జీవీ దర్శకత్వం వహించిన ఆ చిత్రం డిజాస్టర్ అయింది. నితిన్ ‘హీరో’ అనే సినిమా చేసినట్లు జనాలకు పెద్దగా గుర్తు కూడా లేదు. కట్ చేస్తే ఇప్పుడు ఈ టైటిల్‌ను విజయ్ కోసం వాడుతున్నారు.

ఈ చిత్రంలో విజయ్ స్పోర్ట్స్ పర్సన్‌గా కనిపించనున్నాడు. ఇది ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా అని చెబుతున్నారు.  చాలా ఇన్‌స్పిరేషనల్‌గా ఈ సినిమా సాగుతుందట. ‘నోటా’ తర్వాత మరోసారి నేరుగా ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు విజయ్. ఆనంద్ అన్నామలై జాతీయ అవార్డు పొందిన ‘కాకా ముట్టై’ సినిమాకు రచయితగా పని చేసి మంచి పేరు సంపాదించాడు. దక్షిణాదిన అన్ని భాషల వాళ్లకూ తెలిసిన కథానాయికనే ఈ చిత్రానికి హీరోయిన్‌గా ఎంచుకుంటారని సమచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English