లక్ష్మీస్ వీరగ్రంథం.. చాలా చీప్‌గా ఉందే

లక్ష్మీస్ వీరగ్రంథం.. చాలా చీప్‌గా ఉందే

మన దగ్గర విషయం లేకపోయినా.. ఎవరినో ఉడికించడానికి.. ఎవరి మీదో పోటీకి సినిమా తీస్తే వ్యవహారం ఇలాగే తయారవుతుంది. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే ఫిలిం మేకర్ ట్రాక్ రికార్డు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏవో బి-గ్రేడ్ సినిమాలు తీసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. చెన్నైలో తెలుగు వాళ్ల కోసం ఏదో సంఘం పెట్టి వాళ్లను ఉద్దరించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. మన రాజకీయాల మీద ఆయనకు చాలా ఇంట్రెస్ట్.

అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఏవో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే కేతిరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. బాలయ్య అండ్ కో చేపట్టిన ‘యన్.టి.ఆర్’కు పోటీగా రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రకటిస్తే.. దానికి పోటీగా ఆయన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనౌన్స్ చేశాడు.

వర్మ లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ కథను చెప్పడం ద్వారా నందమూరి, నారా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమైతే.. లక్ష్మీపార్వతిని నెగెటివ్‌గా చూపించి ఆమెను ఇబ్బంది పెట్టడం ద్వారా నారా, నందమూరి కుటుంబాాల్ని ప్రసన్నం చేసుకోవాలన్నది కేతిరెడ్డి ప్లాన్. ఐతే టైటిల్ అనౌన్స్ చేసి.. సినిమా తీయకుండానే రెండేళ్లు గడిపేసిన కేతిరెడ్డి ఈ మధ్యే ఏదో కొంత షూటింగ్ చేశాడు. తాజాగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ కూడా రిలీజ్ చేశాడు. అందులోని విజువల్స్ చూస్తే మతి పోతోంది.

‘తెలుగింటి గడపై విరజిమ్మిన విషం’ అంటూ క్యాప్షన్ పెట్టి ఏదో బి-గ్రేడ్ సినిమా విజువల్స్ చూస్తున్న భావన కలిగించాడు కేతిరెడ్డి. చివర్లో దర్శకుడిగా ఆయన దర్శనం కూడా చేయించాడు. టీజర్ అయితే చాలా చీప్‌గా కనిపిస్తోంది. ఇలాంటి సినిమాతో వర్మ చిత్రానికి కౌంటర్ ఇద్దామని ఎలా అనుకున్నాడో కేతిరెడ్డి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English