బెల్లంబాబుపై తేజ ఫైర్?

బెల్లంబాబుపై తేజ ఫైర్?

సీనియర్ దర్శకుడు తేజ తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయనకు కోపం ముక్కు మీదే ఉంటుంది. షూటింగ్ సందర్భంగా ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకోరని అంటారు. నటీనటులు, టెక్నీషియన్ల మీద ఆ కోపాన్ని చూపించేస్తారని చెబుతారు. ఆయన కొన్ని సందర్భాల్లో నటీనటులపై చేయి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. తేజ ఏదైనా వేడుకలో కానీ.. ఇంటర్వ్యూలో కానీ.. మాట్లాడుతున్నపుడు చూసినా.. ఆయనకు సహనం తక్కువ అనే విషయం అర్థమవుతూ ఉంటుంది.

ఎంతటి వారి గురించైనా విమర్శలు గుప్పించడానికి వెనుకాడడు. ‘యన్.టి.ఆర్’ సినిమా నుంచి తప్పుకోవడానికి కూడా తేజలోని ఈ యాటిట్యూడే కారణం అంటారు. బాలయ్యతో అభిప్రాయ భేదాలు రావడంతోనే అంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తేజ బయటికి వచ్చేశాడు. ఈ సినిమా నుంచి వైదొలిగాక తేజ ‘సీత’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా మేకింగ్ సందర్భంగానూ తేజ సహనం కోల్పోయినట్లు సమాచారం. తేజ కోరుకున్నట్లుగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించకపోవడం, లుక్‌తో పాటుగా కొన్ని విషయాల్లో తేజ చెప్పినట్లుగా అతను చేయకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి కూడా మాస్ మసాలా సినిమాలే చేశాడు. తేజ అలాంటి సినిమాలకు దూరం. ఆయన సినిమాల తీరు వేరుగా ఉంటుంది. మాస్ సినిమాల్లో మాదిరి వాటిలో అతి చేస్తే కుదరదు.

తేజ సినిమాల్లో హీరోల పెర్ఫామెన్స్ డిఫరెంటుగా ఉంటుంది. సటిల్ యాక్టింగ్ కోరుకుంటాడాయన. బిల్డప్పులు తక్కువుంటాయి. ఐతే శ్రీనివాస్‌ ఒక తరహా సినిమాలకు అలవాటు పడిపోయి.. అదే నటనను ఇక్కడా కొనసాగించడంతో తేజ ఆగ్రహానికి గురయ్యాడని సమాచారం. ఇంతకుముందు బెల్లంబాబు చేసిన కథలన్నీ హీరో చుట్టూ తిరిగితే.. ‘సీత’లో మాత్రం కథానాయికకే ఎక్కువ ప్రాధాన్యం ఉండటం శ్రీనివాస్‌కు రుచించలేదని.. దీంతో అతనూ తేజ విషయంలో అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. ఐతే ఏదో సర్దుబాటు చేసుకుని పని కానిస్తున్నారట. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English