‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్.. చాలా కథ ఉంది

‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్.. చాలా కథ ఉంది

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న కొత్త సినిమాకు సంబంధించి గురువారం ఒక స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. ఈ ప్రెస్‌ మీట్‌కు లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాను సైతం ఆహ్వానిస్తున్నారు. ముందు కేవలం రాజమౌళి మాత్రమే ప్రెస్ మీట్లో పాల్గొంటాడని.. ఈ చిత్రంలో నటించనున్న కథానాయికల పేర్లు వెల్లడిస్తాడని అన్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రెస్ మీట్ పెద్ద రేంజిలోనే జరగబోతోందట.

రాజమౌళితో పాటు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. మిగతా చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు సైతం ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారట. ఈ కార్యక్రమంలో సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలో మొత్తం కాస్టింగ్ గురించి డీటైలింగ్ ఇస్తారట.

అలాగే ఇప్పటిదాకా జరిగిన చిత్రీకరణ గురించి కూడా కొంత సమాచారం పంచుకుని.. ఇంకా ఎంత షూటింగ్ మిగిలుంది.. ఎప్పటికి సినిమా పూర్తవుతుంది.. ఎప్పుడు రిలీజ్ కావచ్చు అనే సమాచారాన్ని కూడా మీడియాతో పంచుకుంటారని సమాచారం. దీనికి తోడు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఇంకొన్ని విశేషాల్ని పంచుకునే అవకాశముంది. మొత్తంగా చూస్తే ఈ ప్రెస్ మీట్ టాక్ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కావచ్చన్న అంచనాలున్నాయి.

‘బాహుబలి’ తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ను నేషనల్ లెవెల్లో వార్తల్లో నిలబెట్టేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటించనున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో కథానాయిక స్థానానికి చాలా పేర్లు వినిపించాయి. కథానాయికల విషయంతో పాటు వివిధ అంశాలపై గురువారం స్పష్టత వచ్చేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English