‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వస్తుందా రాదా?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వస్తుందా రాదా?

కొన్ని వారాలుగా వెలవెలబోతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్లీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతోనే ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మార్చి 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నాడు. కానీ ఆ సినిమా ఆ రోజు వస్తుందా రాదా అన్న సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అభ్యంతరం చెప్పొచ్చేమో.. లేదా ఏపీలో తెదేపా సర్కారు ఏమైనా అడ్డంకులు సృష్టించవచ్చేమో అని సందేహిస్తున్నారు. ఐతే ఈ అడ్డంకుల్ని దాటడానికి వర్మ తయారుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే దీనికంటే పెద్ద అడ్డంకి ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ముందుంది.

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విడుదల ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దేవీబాబు చౌదరి అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి దిల్లీలో ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపేలా సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సినిమాలో చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారని అతను ఆరోపించాడు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదల ఆపాలని దేవీబాబు ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదు కాపీని పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. ప్రస్తుతం ఆంధ్రాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ చిత్రమైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఎన్నికల సంఘం బ్రేక్ వేస్తుందేమో అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు ఈ సిినిమాకు బ్రేక్ వేయడానికి తెలుగుదేశం పార్టీ కోర్టుకు కూడా వెళ్తోంది. కోర్టుల్లో చంద్రబాబుకు ఉన్న లాబీయింగ్ పవర్‌ ద్వారా సినిమా విడుదలను ఆపిస్తారేమో అన్న ప్రచారం కూడా జరుగుతుండటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English