నాని-అదితి.. ఓ భారీ బడ్జెట్ సినిమా

నాని-అదితి.. ఓ భారీ బడ్జెట్ సినిమా

గత ఏడాది ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘దేవదాస్’ సినిమాలు షాకుల మీద షాకులిస్తేనేమీ నేచురల్ స్టార్ నాని జోరేమీ తగ్గలేదు. అతను క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. అతను కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘జెర్సీ’ బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముగించగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని మొదలుపెట్టాడతను. ఈ చిత్ర షూటింగ్ చకచకా జరుగుతోంది. దీన్ని ఆగస్టులో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ చిత్రంతో సమాంతరంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నాడు నాని. అందులో సుధీర్ బాబు హీరో. ఇవన్నీ పక్కన పెడితే.. నాని హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా పట్టాలెక్కబోతోందన్న సమాచారం బయటికి వచ్చింది.

టాలీవుడ్ సీనియర్ పీఆర్వో ఒకరు ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. నాని సరసన ఈ చిత్రంలో అదితి రావు హైదరి నటించనుందట. ‘సమ్మోహనం’ సినిమాతో మెస్మరైజ్ చేసిన అదితికి ఇక్కడ మంచి క్రేజే వచ్చింది. నాని పక్కన ఆమె బాగా సూటవుతుందన్న అంచనాలున్నాయి. ఆమెకు తెలుగులో ఇది పెద్ద అవకాశమే అని చెప్పొచ్చు. ఓ సెన్సేషనల్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇది భారీ బడ్జెట్ మూవీ అని కూడా చెప్పారు. మరి ఎవరా దర్శకుడు.. అంతగా ఈ సినిమా మీద ఏం ఖర్చు పెట్టేయబోతున్నారు అన్న ఆసక్తి నెలకొంది.

రెండు ఫ్లాపుల తర్వాత కూడా ‘జెర్సీ’ సినిమాకు రూ.50 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందంటే నాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘గ్యాంగ్ లీడర్’ కూడా పెద్ద బడ్జెట్ మూవీనే. వీటికి మించిన బడ్జెట్లో నాని తన కొత్త సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English