బ్లాక్‌బస్టర్‌ అయినా నో యూజ్‌!

బ్లాక్‌బస్టర్‌ అయినా నో యూజ్‌!

సినిమాలు ఫ్లాప్‌ అయినపుడు హీరోయిన్లని ఐరెన్‌ లెగ్‌ అని బ్రాండ్‌ చేసేసే చిత్ర పరిశ్రమ, సినీ మీడియా... అదే ఒక సినిమా పెద్ద హిట్‌ అయినపుడు అందులోని హీరోయిన్లకి చాలా రేర్‌గా క్రెడిట్‌ ఇస్తుంటారు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతోన్న దశలో ఒకే చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన మిల్కీ బ్యూటీస్‌ తమన్నా, మెహ్రీన్‌కి 'ఎఫ్‌ 2' సక్సెస్‌ క్రెడిట్‌ ఎవరూ ఇవ్వడం లేదు. ఈ చిత్రం సక్సెస్‌కి లయన్‌ షేర్‌ వెంకటేష్‌కి ఇచ్చేసారు. ఇక మిగతాది వుంటే వరుణ్‌ తేజ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి పంచుకున్నారు. హీరోయిన్లద్దరికీ కూడా బ్లాక్‌బస్టర్‌ సినిమాలో నటించిన పేరు దక్కినా ఆ సక్సెస్‌ క్రెడిట్‌ని క్యాష్‌ చేసుకునే వీలు చిక్కడం లేదు.

ఇంత పెద్ద హిట్‌ తర్వాత ఎవరికైనా వరుసగా అవకాశాలు వచ్చి పడిపోవాలి. కానీ వీరిని ఎవరూ అంతగా ఖాతరు చేయడం లేదు. పారితోషికం కూడా ఏమీ పెంచలేదని చెబుతున్నారు. సక్సెస్‌లో హీరోయిన్స్‌కి షేర్‌ లేదనే వారు ఫెయిల్యూర్‌లో కూడా వారికి అంతే షేర్‌ ఇవ్వాలి. ఒక సినిమా సక్సెస్‌కి హీరోయిన్‌ హెల్ప్‌ అవనపుడు ఫ్లాప్‌ అయిన టైమ్‌లో ఆమెని ఐరెన్‌ లెగ్‌ అని ఎలా బ్లేమ్‌ చేస్తారు? బాలీవుడ్‌లో హీరోయిన్లకి కూడా హీరోలతో పాటు సమానమైన పే కావాలని కొందరు టాప్‌ హీరోయిన్లు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ దక్షిణాదిలో హీరోయిన్లకి సమాన పారితోషికం సంగతి అటుంచి కనీసం తమ పనికి, విజయానికి అయినా తగిన గుర్తింపుని ఇవ్వడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English