మా ఎన్నిక‌ల్లో ప్రియ‌మ‌ణి సో స్పెష‌ల్ ఎందుకంటే?

 మా ఎన్నిక‌ల్లో ప్రియ‌మ‌ణి సో స్పెష‌ల్ ఎందుకంటే?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ఒక్క అక్ష‌రంలో చెప్పాలంటే మా ఎన్నిక‌లు ఆదివారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా ప్ర‌చారం జ‌ర‌గ‌టం.. పోటాపోటీగా రెండు ప్యాన‌ళ్లు అధికారం కోసం త‌ల‌ప‌డ్డారు. మొత్తంగా న‌రేశ్ మా అధ్యక్షుడిగా ఎంపిక‌య్యారు. ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల్లో అత్యంత కీల‌క‌మైన పోలింగ్ విష‌యంలో ఒక ప్ర‌త్యేక‌త కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.

ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ కు సీనియ‌ర్ న‌టులు పెద్ద ఎత్తున వ‌చ్చి ఓటు వేశారు. అయితే.. సీనియ‌ర్ న‌టీమ‌ణులు ప‌లువురు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. అయితే..యంగ్ హీరోయిన్ల ప‌త్తా లేకుండా పోయారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటుహ‌క్కు గురించి చిల‌క‌ప‌లుకులు ప‌లికే భామ‌లంతా త‌మ సొంత సంస్థ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు ఇంట్ర‌స్ట్ ను చూపించ‌లేదు.

అవార్డు ఫంక్ష‌న్ల‌కు.. ఇత‌ర వాణిజ్య సంస్థ ఓపెనింగ్స్ కు పోటెత్తే భామ‌లు.. ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రాక‌పోవ‌టం చ‌ర్చ‌గా మారింది. అయితే.. వీరికి భిన్నంగా న‌టి ప్రియ‌మ‌ణి ఒక్క‌రు మాత్రం ఓటు వేసేందుకు వ‌చ్చారు. దీంతో.. మిగిలిన హీరోయిన్ల‌కు భిన్నంగా ప్రియ‌మ‌ణి ఓటు వేసి సో స్పెష‌ల్ గా నిలిచారు.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. మా ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు సీనియ‌ర్ హీరోలంతా వ‌రుస పెడితే.. అందుకు భిన్నంగా ప్ర‌ముఖ యంగ్ హీరోలు మాత్రం ఓటు వేసేందుకు రాలేదు. ఆ జాబితాలో  మహేశ్‌బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, చిన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తదితర‌లుఉన్నారు. అదే స‌మ‌యంలో యువ హీరోలు అల్లరి’ నరేశ్‌, నాని, రానా, సాయిధరమ్‌ తేజ్‌, సుధీర్‌ బాబు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ఆది సాయికుమార్‌, సాయిరామ్‌ శంకర్‌లు మాత్రం ఓటు వేయ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English