భాయ్‌కి బాగా ఎక్కేసిందంట

భాయ్‌కి బాగా ఎక్కేసిందంట

 దక్షిణాది సినిమాల్ని హిందీలోకి రీమేక్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మరీ వాటి మీదే బతికేస్తున్న సల్మాన్‌ఖాన్‌ త్వరలో మరో రీమేక్‌లో నటించబోతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ నటించిన ఆర్య 2 చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సల్మాన్‌ సుముఖంగా ఉన్నట్టు భోగట్టా. ఆర్య 2 కమర్షియల్‌గా ఫ్లాప్‌ అయినా కానీ అందులో హీరో క్యారెక్టరైజేషన్‌, కొత్త తరహా స్క్రీన్‌ప్లే సల్మాన్‌కి బాగా నచ్చేశాయట. అందుకే ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ చీప్‌గా కొట్టేయడం కోసం తన మనుషులతో సంప్రదింపులు జరుపుతున్నాడట.

కాంచన, దూకుడు సినిమాలని రీమేక్‌ చేయాలని భావించిన సల్మాన్‌ ఆ తర్వాత ఆ ఆలోచన మానుకున్నాడు. ప్రస్తుతం కిక్‌ రీమేక్‌ మాత్రమే చేస్తున్నాడు. రొటీన్‌ సినిమాలు చేస్తున్నాడనే కామెంట్స్‌ పడుతుండడంతో సల్మాన్‌ ఈసారి పంథా మార్చి ఆర్య 2లాంటి కథని ఎంచుకున్నట్టున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు