ఆ దర్శకుడి సినిమా.. ఎట్టకేలకు

ఆ దర్శకుడి సినిమా.. ఎట్టకేలకు

దక్షిణాది సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. కాక్క కాక్క.. వేట్టయాడు విలయాడు.. ఏం మాయ చేసావె.. ఎటో వెళ్లిపోయింది మనసు.. ఇలా గౌతమ్ నుంచి ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి. దక్షిణాదిన ప్రతి హీరో కూడా గౌతమ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడే స్థాయి ఆయనది. కానీ ఈ మధ్య గౌతమ్ పిలిచి సినిమా చేస్తానన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఇందుక్కారణం గౌతమ్ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతుండటమే.

గౌతమ్ వేలు పెట్టిన మూడు సినిమాలు ఎటూ కాకుండా పోయాయి. తన దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ అనే సినిమా.. విక్రమ్ కథానాయకుడిగా ‘ధృవనక్షత్రం’ అనే మరో చిత్రం మొదలుపెట్టాడు. ఈ రెండు సినిమాలూ పూర్తయినా కూడా విడుదలకే నోచుకోలేదు. అతను నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘నరకాసురన్’ అనే సినిమా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.

ధనుష్ మంచి ఫాంలో ఉండగా గౌతమ్‌తో సినిమా మొదలుపెట్టాడు. చకచకా సినిమాను కూడా పూర్తి చేశాడు. ఎప్పుడో మూడేళ్ల కిందటే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయినట్లు కనిపించింది. కానీ గౌతమ్ ప్రొడక్షన్‌ హౌజ్‌కు ఉన్న ఫైనాన్స్ సమస్యల వల్ల సిినిమా బయటికి రాలేదు. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిపేశాడు గౌతమ్. ఐతే ఎట్టకేలకు ఫైనాన్షియర్లతో ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మార్గం సుగమం చేసుకున్నాడట గౌతమ్.

‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తుందట. అక్కడ రిలీజ్ పక్కా అయితే.. తెలుగులో కూడా దీన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘లై’లో మేఘా ఆకాష్ ఇందులో కథానాయిక. ఆమెకిదే తొలి చిత్రం. ఇది రాకముందే మూణ్నాలుగు సినిమాలు రిలీజైపోయాయి. అవేవీ కూడా ఆడలేదు. కనీసం తన తొలి సినిమా అయినా సక్సెస్ అయి తన కెరీర్‌కు ఊపు తెస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English