మళ్లీ అర్జున్ రెడ్డి జంట?

మళ్లీ అర్జున్ రెడ్డి జంట?

‘అర్జున్ రెడ్డి’లో మైండ్ బ్లోయింగ్ అనిపించిన విషయాలు చాలానే ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి పని తనాన్ని పక్కన పెడితే.. హీరోగా విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ ఔట్ స్టాండింగ్ అనే చెప్పాలి. ఐతే అతను అంతగా డామినేట్ చేసినా కూడా ప్రీతి పాత్రలో షాలిని పాండే కూడా గొప్పగా నటించింది. సటిల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది.

రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ల ఫీచర్స్ లేకపోయినా సరే.. తన పెర్ఫామెన్స్‌తో షాలిని చెరగని ముద్ర వేసింది. ఐతే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఎందులోనూ ఆమె ఆ స్థాయి ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ప్రీతి పాత్రను మ్యాచ్ చేసే క్యారెక్టర్ ఇంకేదీ ఆమె దగ్గరికి రాలేదు. విజయ్ దేవరకొండ పక్కన సూటైనట్లుగా ఇంకెవరితోనూ ఆమెకు జోడీ కుదర్లేదు. ఐతే ఇప్పుడు మళ్లీ విజయ్ పక్కనే ఆమెకు అవకాశం దక్కినట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. వెంటనే అతడితో ఇంకో సినిమా లైన్లో పెట్టింది. కోలీవుడ్‌కు చెందిన కొత్త దర్శకుడు ఆనంద్ అన్నామలై.. విజయ్ హీరోగా ఒక సినిమా తీయబోతున్నట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని మైత్రీ వాళ్లే ప్రొడ్యూస్ చేయబోతున్నారట. తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కబోయే ఈ చిత్రంలో విజయ్ స్పోర్ట్స్ పర్సన్‌గా కనిపించనున్నాడట.

ఇదొక ఇన్‌స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. ఇందులో విజయ్ సరసన షాలినిని కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. మరోసారి ‘అర్జున్ రెడ్డి’ జంట అంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగతాయనడంలో సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం విజయ్.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సింగరేణి నేపథ్యంలో సాగే రూరల్ మూవీలో నటిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English