36 కోట్లకి సాహో ఎగరేసుకుపోయారు!

36 కోట్లకి సాహో ఎగరేసుకుపోయారు!

ప్రభాస్‌ నటిస్తోన్న సాహో అంతర్జాతీయ శ్రేణి నిర్మాణ విలువలతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారతీయ తెరపై ఎన్నడూ చూడని రేంజ్‌ యాక్షన్‌ సినిమా అని దీని గురించి చెప్పుకుంటున్నారు. బాహుబలి తర్వాత వస్తోన్న ప్రభాస్‌ సినిమా కావడంతో సాహోపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఈ చిత్రాన్ని కూడా వివిధ భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు సకల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు చేస్తుందనే నమ్మకంతో బయ్యర్లు భారీ మొత్తాలకి సాహో రైట్స్‌ తీసేసుకుంటున్నారు.

ఓవర్సీస్‌లో సాహో అన్ని భాషల హక్కులు కలిపి ముప్పయ్‌ ఆరు కోట్లకి ఫార్స్‌ ఫిలింస్‌ అనే సంస్థ దక్కించుకోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. దుబాయ్‌కి చెందిన ఈ కంపెనీ అచ్చంగా తెలుగు కోసం రూపొందిన సినిమాకి ఇంత మొత్తం వెచ్చించడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిని బట్టి ఈ చిత్రానికి లోకల్‌గా జరిగే బిజినెస్‌ ఇంకే స్థాయిలో వుంటుందోనని చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంపై బజ్‌ తీవ్రతరం అయ్యే వరకు బిజినెస్‌ క్లోజ్‌ చేయరాదనే స్ట్రాటజీతో యువి క్రియేషన్స్‌ హైప్‌ని ఇంకా ఇంకా పెంచుతూ వెళుతోంది. బాహుబలేతర చిత్రాల్లో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా సాహో కొత్త రికార్డులు నెలకొల్పడమయితే ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English