మహేష్‌ ముద్రతో అక్కడా హిట్టవుతుందా?

మహేష్‌ ముద్రతో అక్కడా హిట్టవుతుందా?

కళ్యాణ్‌రామ్‌ చిత్రం 118 విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆరు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి చేరిన ఈ చిత్రం ఈ వారాంతంలో కూడా మంచి వసూళ్లు రాబట్టుకోనుంది. చెప్పుకోతగ్గ సినిమా ఒక్కటీ విడుదల లేదు కనుక 118కి ఇది ప్లస్‌ అవుతుంది. మంచి బజ్‌కి తోడు ఇప్పుడు మహేష్‌ బాబు ఆమోద ముద్ర కూడా లభించింది. ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేసానని చెబుతూ దర్శకుడు గుహన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల వస్తోన్న సక్సెస్‌ఫుల్‌ లేదా ముఖ్యమయిన సినిమాలన్నీ చూస్తూ తన అభిప్రాయాన్ని మహేష్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

అలాగే 118 చిత్రానికి కూడా మహేష్‌ ప్రశంసలు అందించాడు. ఈ చిత్రానికి మహేష్‌ ట్వీట్‌ ప్లస్‌ అవుతుందని, సరిగ్గా రెండవ వారాంతానికి ముందు మహేష్‌ ట్వీట్‌ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్‌ అని, ఇంతవరకు ఈ చిత్రం చూడని వారు ఇప్పుడు చూడాలని అనుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఓవర్సీస్‌లో ఇంకా లక్ష డాలర్ల గ్రాస్‌ కూడా సాధించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడైనా అక్కడ హిట్‌ స్టేటస్‌ అందుకోగలదా లేదా అనేది చూడాలి. మంచి రివ్యూస్‌ వచ్చినా కానీ యుఎస్‌ ఆడియన్స్‌ ఎందుకో ఈ చిత్రాన్ని బాగా ఓవర్‌ లుక్‌ చేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English