దేశం అవతల ప్రభాస్ స్టామినా అదీ..

దేశం అవతల ప్రభాస్ స్టామినా అదీ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ‘బాహుబలి’ సినిమాతో ఊహించని స్థాయికి చేరుకుంది. ఒకేసారి అతడి మార్కెట్ దాదాపు పది రెట్లు పెరిగింది. ‘బాహుబలి’కి ముెందు అతడి నుంచి వచ్చిన ‘మిర్చి’ సినిమాకు రూ.30 కోట్లతోో అమ్మకాలు జరిగితే.. ఇప్పుడు ‘సాహో’ రూ.300 కోట్ల మేర బిజినెస్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రానికి అన్ని భాషల నుంచి, అన్ని ఏరియాల నుంచి క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. దేశం అవతల ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.42 కోట్లు పలికాయన్న వార్త సంచలనం రేపుతోంది. ఫార్ ఫిలిమ్స్ అనే సంస్థ ‘సాహో’ ఇంటర్నేషనల్ థియేట్రికల్ రైట్స్‌ను రూ.42 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇటీవలే ఈ డీల్ పూర్తయినట్లు సమాచారం. చైనా మినహా అన్ని దేశాల్లో ఆ సంస్థే సినిమాను రిలీజ్ చేయబోతోందట. మధ్యలో మారు బేరానికి లోకల్ బయ్యర్లకు ఎక్కువ రేటుకు హక్కులు అమ్ముకునే అవకాశమూ లేకపోలేదు.

‘సాహో’ మంచి విజయం సాధిస్తే.. ఈ చిత్రాన్ని చైనాలోనూ పెద్ద స్థాయిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ‘బాహుబలి’ రెండు భాగాలూ అక్కడ పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం బాగానే ఆడింది. ప్రభాస్‌కు అక్కడ గుర్తింపైతే వచ్చింది కాబట్టి ‘సాహో’ను కూడా రిలీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక ‘సాహో’ ఇండియా రైట్స్ వివిధ భాషలకు కలిపితే రూ.200 కోట్లకు తక్కువ కాకుండా తెచ్చి పెట్టే అవకాశముంది. ‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. ‘సాహో’లో వివిధ భాషల నటీనటులున్నారు. టెక్నీషియన్లున్నారు. యాక్షన్ ప్రధానంగా సినిమా కథాంశం కూడా అందరికీ కనెక్టయ్యే లాగే ఉంది. థియేట్రికల్ హక్కుల్ని పక్కన పెడితే.. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలోనూ ‘సాహో’ భారీ స్థాయిలో నిర్మాతలకు ఆదాయం తెచ్చి పెట్టే అవకాశముంది. సినిమాకు మంచి టాక్ రావాలే కానీ.. రూ.500 కోట్ల గ్రాస్ మార్కును దాటే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English