ఈసారి దేన్ని లేపుకొస్తున్నాడో?

ఈసారి దేన్ని లేపుకొస్తున్నాడో?

క్రియేటివిటీ లేకపోయినా.. ప్రేక్షకుల పల్స్ తెలిసి వాళ్లను మెప్పించే మేకింగ్‌తో మ్యాజిక్ చేయగలిగితే డైరెక్టర్‌గా సక్సెస్ అయిపోవచ్చు. ఇందుకు బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టినే ఉదాహరణ. కెరీర్ ఆరంభం నుంచి అతడి సినిమాలు చూస్తే ఎక్కడా క్రియేటివిటీ కనిపించదు. రొటీన్ ఊర మాస్ సినిమాలతోనే బండి లాగిస్తున్నాడు. అతను సొంతంగా కథలు రాయడు. వేరే వాళ్ల కథలు తీసుకుంటాడు. పాత కథల్ని రీసైకిల్ చేయిస్తాడు. లేదంటే సౌత్‌లో విజయవంతమైన సినిమాల కథలు తీసుకుని వాటికి తనదైన ట్రీట్మెంట్ ఇస్తాడు.

ఇలా చేసే బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అతడి సినిమాలు పది దాకా వంద కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. చివరగా ‘టెంపర్’ ఆధారంగా అతను తీసిన ‘సింబా’ బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా రూ.250 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టేశాడు రోహిత్.

ఈ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నుంచి రాబోతున్న కొత్త సినిమా.. సూర్యవంశీ. వినడానికి తెలుగు సినిమా పేరులా ఉన్న ఈ టైటిల్‌తో అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘బుల్లెట్ ఫర్ బుల్లెట్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. దీన్ని బట్టే ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ స్టయిల్లోనూ ఊర మాస్‌గా సినిమా నడిచే అవకాశముంది. పోలీస్ స్టోరీలను ప్రెజెంట్ చేయడంలో అతడి స్టయిలే వేరు. పైగా అక్షయ్ కుమార్ లాంటి మాంచి మాస్ హీరో దొరికాడు.

అక్షయ్ కొన్నేళ్లుగా వరుసగా ప్రయోగాత్మక, సామాజిక అంశాలతో సినిమాలు చేస్తున్నాడు. అతడి నుంచి ‘రుస్తుం’.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. ‘ప్యాడ్ మ్యాన్’.. ‘గోల్డ్’ లాంటి మంచి సినిమాలొచ్చాయి. ఐతే ఇలాంటి సినిమాలే చేస్తూ తన మాస్ అభిమానులకు దూరమైపోతున్నాననుకుని రోహిత్‌‌తో సినిమా చేస్తున్నట్లున్నాడు. ఐతే రోహిత్ ఎప్పుడూ కొత్తగా ఏమీ చేయడు. ఈ కథకు కూడా ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. ఈసారి రోహిత్ ఎక్కడి నుంచి కథ లేపుకొచ్చాడన్నదే తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English