చిరంజీవి డేట్‌ మహేష్‌కి ప్లస్‌ అవుతుందా?

చిరంజీవి డేట్‌ మహేష్‌కి ప్లస్‌ అవుతుందా?

మహేష్‌కి మే నెల కలిసి రాలేదు కాబట్టి 'మహర్షి'ని వాయిదా వేయవద్దని, ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని ఒత్తిడి వుందని ఆల్రెడీ రిపోర్ట్‌ చేసాం. అయితే ఏప్రిల్‌ 25 రిలీజ్‌ డేట్‌ పెట్టుకుంటే చాలా ప్రెజర్‌ వుంటుందని భావించి, మహేష్‌ని కన్విన్స్‌ చేసి మే 9కి వాయిదా వేయించారు. ఇందులో అశ్వనీదత్‌ పాత్ర చాలా వుందని సమాచారం. ఆయనకి ఈ డేట్‌ బ్రహ్మాండంగా కలిసి రావడంతో మరోసారి అదే రోజున రిలీజ్‌ చేద్దామని, బ్లాక్‌బస్టర్‌ అవుతుందని మహేష్‌ని కన్విన్స్‌ చేసారట. ఆయన తీసిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మహానటి' చిత్రాలు మే 9నే విడుదలయ్యాయి.

చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్‌ 'గ్యాంగ్‌లీడర్‌' కూడా అదే తేదీన విడుదలయింది. నిజానికి 'గబ్బర్‌సింగ్‌'ని కూడా అదే డేట్‌కి విడుదల చేద్దామనుకుని తర్వాత మే 11కి వాయిదా వేసారు. మహేష్‌కి కూడా మే 9 కలిసి వస్తుందని, ఖచ్చితంగా అతని ఇరవై అయిదవ చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులు సాధిస్తుందని ఒప్పించారట. అభిమానులు మే రిలీజ్‌ వద్దని మహేష్‌కి చెప్పినా కానీ లాస్ట్‌ మినిట్‌ టెన్షన్లు వద్దనుకుని మహేష్‌ కూడా ఈ డేట్‌కి కన్విన్స్‌ అయిపోయాడట. మరి ఈ మెగా డేట్‌ ఇకపై సూపర్‌ డేట్‌గా కూడా గుర్తుండిపోతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English