దిల్‌ రాజు దిగొచ్చాడు

దిల్‌ రాజు దిగొచ్చాడు

96 చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తోన్న దిల్‌ రాజు ఆ ఫీల్‌గుడ్‌ సినిమాకి కమర్షియల్‌ రీచ్‌ పెంచాలని చూస్తున్నాడు. మిడిల్‌ ఏజ్‌లో వున్న హీరో హీరోయిన్లు చేయాల్సిన కథకి శర్వానంద్‌, సమంతలాంటి యంగ్‌ పెయిర్‌ని సెలక్ట్‌ చేసాడు. అలాగే సంగీత పరంగా కూడా దేవిశ్రీప్రసాద్‌ అయితే మాస్‌ అప్పీల్‌ పెరుగుతుందని భావించాడు. అందుకోసం దర్శకుడు ప్రేమ్‌ని కన్విన్స్‌ చేయడానికి చూసాడు. కానీ అతనేమో తమిళ చిత్రానికి మ్యూజిక్‌ చేసిన గోవింద్‌ని తీసుకుంటానన్నాడు. కావాలంటే అతనికి రాయల్టీ ఇచ్చి రెండు పాటలు వాడుకుందామని, మిగతావి దేవితో చేయిద్దామని దిల్‌ రాజు పట్టుబట్టాడు.

కానీ కథ సోల్‌కి తగ్గ మ్యూజిక్‌ అతనే ఇవ్వగలడని, అతనితో తనకి ట్యూనింగ్‌ కుదిరిందని చెప్పి ఆ దర్శకుడు గట్టిగా చెప్పడంతో దిల్‌ రాజు దిగి రాక తప్పలేదు. మధ్యలో కొద్ది రోజులు ఆగిపోయిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మళ్లీ మొదలయ్యాయి. ఇదిలావుంటే ఈ చిత్రానికి 'జానకి - దేవి', 'జాను' అనే టైటిల్స్‌ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ శర్వానంద్‌, సమంత ఏజ్‌కి తగ్గట్టుగా 2006 టైటిల్‌ ఎలా వుంటుందనేది కూడా ఆలోచిస్తున్నారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English