ఒక్క ఫ్లాప్‌తో సీన్‌ సితార్‌

ఒక్క ఫ్లాప్‌తో సీన్‌ సితార్‌

హిట్లు ఇచ్చినంత కాలమే ఏ దర్శకుడికి అయినా ఇప్పుడు డిమాండ్‌. ఈ నెట్‌ఫ్లిక్స్‌ జమానాలో టాలెంట్‌కి లోటేమీ లేదు. ఫిలింమేకర్స్‌ కావాలని తహతహలాడే కుర్రాళ్లు కొత్త కొత్త ఆలోచనలతో నిత్యం సినిమా ఇండస్ట్రీ తలుపు తడుతూనే వున్నారు. అందుకే ఎంత సక్సెస్‌ అయిన దర్శకుడైనా కానీ తన ఉనికి నిలుపుకోవడానికి హిట్‌ సినిమాలు తీస్తూనే వుండాలి. కనీసం పరువు పోయే విధంగా చెత్త చిత్రమైతే చేయకూడదు. అలా చేస్తే కనుక ఇక హీరోల అపాయింట్‌మెంట్‌ కూడా దొరకదు. కార్తికేయ, ప్రేమమ్‌తో వరుస విజయాలు అందుకున్న చందు మొండేటికి అప్పట్లో ఫుల్‌ డిమాండ్‌.

మధ్య శ్రేణి హీరోలంతా అతనితో సినిమా చేయాలని ఎదురు చూసారు. కానీ ఒక్క సవ్యసాచితో సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడు చందు మొండేటి కథ చెబుతానని అంటున్నా ఖాళీ లేదని అంటున్నారు. తనతో పని చేయడానికి చాలా ఆసక్తి చూపించిన శర్వానంద్‌కి చందు కథ చెప్పాలని అనుకున్నాడు. అతను విదేశాల్లో వున్నా కానీ ఒక రెండు గంటలు సమయమిస్తానంటే వచ్చి చెబుతానని కబురంపాడు. కానీ శర్వానంద్‌ ఇప్పుడు తన డేట్లు ఖాళీ లేవని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో మరోసారి నిఖిల్‌తోనే 'కార్తికేయ 2' చేసే పనుల్లో చందు మొండేటి దృష్టి పెట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English