కెరీర్లో బిగ్గెస్ట్ ఛాన్స్ పట్టేసిందా?

కెరీర్లో బిగ్గెస్ట్ ఛాన్స్ పట్టేసిందా?

రష్మిక మందన్నా.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో యమ ఊపుమీదున్న హీరోయిన్. సొంతగడ్డ అయిన కన్నడ నాటే కాక తెలుగు, తమిళ భాషల్లోనూ ఆమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన ఆమె.. ఇంకో రెండు మూడు క్రేజీ సినిమాలు చేతిలో పెట్టుకుంది. తాజాగా తమిళంలో కార్తి సరసన అవకాశం పట్లేసింది.

మరోవైపు కన్నడలోనూ స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడామె తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ పట్టేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కథానాయికగా రష్మికను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ‘మహర్షి’ని ముగించే పనిలో ఉన్న మహేష్.. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రష్మిక కథానాయికగా దాదాపు ఓకే అయినట్లు సమాచారం.

ఈ చిత్రంలో కథానాయికగా సాయిపల్లవి పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే గ్లామర్ పరంగా చూసుకుంటే మహేష్ పక్కన సాయిపల్లవి అంతగా సూట్ కాదని.. ఆమె కంటే రష్మిక బాగుంటుందని అనిల్ భావిస్తున్నాడట. సాయిపల్లవి ఇప్పుడంత ఫాంలో లేకపోవడం కూడా ఆమె విషయంలో వెనక్కి తగ్గడానికి కారణమై ఉండొచ్చంటున్నారు.

రష్మికను కథానాయికగా ఖరారు చేస్తూ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రావచ్చంటున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నట్లు సమాచారం. దిల్ రాజు కూడా భాగస్వామి అయ్యే అవకాశముంది. ప్రస్తుతం స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ చేసే పనిలో ఉన్నాడు అనిల్. త్వరలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. వేగంగా.. ఓ మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉందట చిత్ర బృందం. అనిల్ స్టయిల్లో పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English