ప్రభాస్ డార్లింగ్ మూమెంట్ వైరల్

ప్రభాస్ డార్లింగ్ మూమెంట్ వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఎంత కేర్ ఫ్రీ యాటిట్యూడ్‌తో ఉంటాడో తెలిసిందే. ఎక్కడా కూడా అతను తేడాగా ప్రవర్తించడు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరితో మర్యాద పూర్వకంగా నడుచుకుంటాడు. అభిమానుల్ని డీల్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఫ్యాన్స్ తనతో ఫొటోలు దిగాలని ప్రయత్నించినా.. మన్నిస్తాడు. వారితో ప్రేమగా ఉంటాడు. ప్రభాస్ బయట కనిపించడం తక్కువ కానీ.. అలా కనిపించినపుడల్లా అతడి ప్రవర్తన ఆకట్టుకుంటుంది.

తాజాగా అతను ఒక లేడీ ప్యాన్‌ను ఆదరించిన తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సాహో’ చిత్రీకరణ కోసం అమెరికా వెళ్లిన సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది.

ఎయిర్ పోర్టులో తాపీగా నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్‌ను చూసి ఓ అమ్మాయి ఎగ్జైట్ అయింది. అతడితో ఫొటో దిగాలని కోరుకుంది. ప్రభాస్ ఆమె కోరిక మన్నించాడు. ఓపిగ్గా ఫొటో దిగాడు. ఆ సందర్భంగా ఆ అమ్మాయి ఉద్వేగం మామూలుగా లేదు. ఎగిరి గంతులేస్తూ తన ఆనందాన్ని ప్రకటించింది. చివర్లో ప్రభాస్ బుగ్గ మీద సుతిమెత్తగా కొట్టింది. ఆపై మరింతగా గంతులేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి ప్రభాస్‌తో ఫొటో దిగాడు. ఈ మొత్తం ఉదంతంలో ప్రభాస్ చాలా హుందాగా ప్రవర్తించాడు.

ఆ అమ్మాయికి జీవిత కాల అనుభవాన్ని మిగిల్చాడు. ప్రభాస్‌ను అందరూ డార్లింగ్ అని ఎందుకంటారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఫొటోలు దిగాల్సి వచ్చినపుడు చాలామంది హీరోలు అసహనానికి గురవుతుంటారు. ఆ అమ్మాయి బుగ్గ మీద కొడితే అందరి రియాక్షన్ ఒకేలా ఉండకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English