హీరో, డైరెక్టర్‌ ఈగో మధ్య నిర్మాత బలి

హీరో, డైరెక్టర్‌ ఈగో మధ్య నిర్మాత బలి

సుకుమార్‌తో మహేష్‌ సినిమా కాన్సిల్‌ చేసుకోవడానికి కారణం కథ నచ్చకపోవడం, క్రియేటివ్‌ డిఫరెన్సులు రావడం కాదు. తనకి ప్రాధాన్యత ఇవ్వకుండా అనిల్‌ రావిపూడితో సమానంగా చూడడం సుకుమార్‌కి నచ్చలేదట. ఎవరు ముందుగా కథ సిద్ధం చేస్తే వారితో సినిమా మొదలు పెడతానని అనడంతో సుకుమార్‌ ఈగో హర్ట్‌ అయిందట. అందుకే తనకి అల్లు అర్జున్‌తో సినిమా రెడీగా వుందనే సంకేతాలు పంపించడానికి ఆ సినిమా ప్రకటన వదిలాడట. మహేష్‌ ఒత్తిడికి గురవుతాడని అనుకుంటే, అతను ఏకంగా సినిమానే లేదనేసాడు. అలా హీరో, డైరెక్టర్‌ ఇద్దరూ ఈగోలకి పోయి మొత్తానికి సినిమా కాన్సిల్‌ చేసేసారు.

దీంతో నిర్మాతలు మధ్యలో నలిగిపోయారు. మహేష్‌తో సినిమా వుందనే ధైర్యంతో ఈమధ్య రెండు ఫ్లాపులు తగిలినా పెద్దగా లెక్క చేయలేదు. మహేష్‌ సినిమా వెంటనే మొదలవుతుందనే నమ్మకంతో వేరే స్టార్‌ హీరోలని కూడా సంప్రదించలేదు. అలాగే మహేష్‌కి భారీగా అడ్వాన్స్‌ ఇవ్వడంతో పాటు సుకుమార్‌ కథాచర్చలపై కూడా ఏడాది కాలంగా ఖర్చు పెడుతున్నారు. తీరా చూస్తే ఆ సినిమానే లేదిప్పుడు. ఈగోల కారణంగా తమ సినిమా ఆగిపోయినా కానీ మైత్రి మూవీ మేకర్స్‌ వారు గోడు వినే నాధుడే లేడు. ఇక అల్లు అర్జున్‌ ఎప్పుడు డేట్స్‌ ఇస్తాడా అని ఎదురు చూడడం తప్ప వారికి ఇంకో ఆప్షన్‌ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English