ప్ర‌పంచ ప్ర‌జాద‌ర‌ణ నేత‌గా మోడీ.. ఆరోస్థానంలో బైడెన్‌

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మ‌రోసారి మొదటి స్థానంలో నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ జాబితాలో ఆరో స్థానానికి పరిమితమయ్యా రు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని తెలిపా రు. ప్ర‌స్తుతం ఈ జాబితా, స‌ర్వేపై ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా.. జోబైడెన్ 6వ స్థానానికి ప‌రిమితం కావ‌డంపై మ‌రింత ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.

నరేంద్ర మోడీ 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా తన పాపులారిటీని అంత కంతకూ పెంచుకుంటున్నారు. తాజాగా మార్నింగ్ క‌న్స‌ల్ట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ప్రపంచ వ్యాప్తం గా అత్యంత ప్రజాదరణ గల నేతల్లో ఆయనే తొలి స్థానంలో నిలిచారు. సంపన్నదేశాల అధ్యక్షులు కూడా మోడీకి దరిదాపుల్లో కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన ఈ సర్వే ఫలితాల్లో అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బెడైన్ ఆరో స్థానంలో ఉన్నారు. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు.

ఈ సర్వే ప్రకారం మోడీ 70శాతం ఓట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ టాప్ 10లో చివరి స్థానంలో నిలిచారు.

మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకునేందుకు ఒక‌ సర్వే నిర్వహిస్తుంది. గతేడాది కూడా ప్రధాని మోడీనే మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి సర్వేలో భారత్లో 2,126 మందిని ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసిన‌ మార్నింగ్ కన్సల్ట్.. ఈ ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఏయే దేశాధినేత‌లు ఏయే స్థానాల్లో..

ఏంజెలా మెర్కెల్(జర్మనీ ఛాన్సలర్)-54శాతం, స్కాట్ మోరిసన్(ఆస్ట్రేలియా ప్రధాని)- 47శాతం, జో బైడెన్, (అమెరికా అధ్యక్షుడు)44శాతం, జస్టిన్ ట్రుడో(కెనడా ప్రధాని) 43శాతం, ఫుమియో కిషిదా (జపాన్ ప్రధాని)-42శాతం, మూన్ జె-ఇన్-(దక్షిణ కొరియా అధ్యక్షుడు)-41శాతం, బోరిస్ జాన్సన్, (బ్రిటన్ ప్రధాని) -40శాతం, పెడ్రో సాంచెజ్,(స్పెయిన్ ప్రధాని)-37శాతం, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్(ఫ్రాన్స్ అధ్యక్షుడు )-36శాతం, జైర్ బోల్సొనారో (బ్రెజిల్ అధ్యక్షుడు) 35శాతం