ఇదండీ టాలీవుడ్ పరిస్థితి!!

ఇదండీ టాలీవుడ్ పరిస్థితి!!

చాలా రోజుల తరువత టాలీవుడ్ డల్ అయిపోయింది. థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమలైనా మొదటి వారమే హౌస్ ఫుల్ థియేటర్స్ తో కనిపిస్తుంటాయి. ఇక చిన్నాచితకా సినిమాలు  పాజిటివ్ టాక్ వస్తే గాని థియేటర్ లో సగం సీట్లు కూడా నిండడం లేదు. అలాంటిది డబ్బింగ్ సినిమాలు వస్తే ఇక జనాలేం పట్టించుకుంటారు. గత కొన్ని వారాలుగా టాలీవుడ్ చాలా సైలెంట్ అయిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ తరువాత మరే పెద్ద సినిమా రాలేదు.

వారానికి ఒకటి రెండు చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో F2 సినిమ మాత్రమే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇక అత్యాశకుపోయి కొంత మంది బయ్యర్లు తమిళ్ డబ్బింగ్ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఆ సినిమాలను తెలుగు జనాలను అస్సలు పట్టించుకోవడం లేదు.  అజిత్ విశ్వాసంతో పాటు నయనతార అంజలి IPS సినిమా తెలుగులో గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. కానీ ఆ సినిమాలు ముందే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోకి దిగడంతో సబ్ టైటిల్స్ తో చాలామంది సినీ లవర్స్ ముందే చూసేశారు. ఇక డైరెక్ట్ గా రిలీజైన దేవ్ - లవర్స్ డే సినిమాలు గట్టిగా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసినా కూడా క్లిక్ అవ్వలేదు.

ఇకపోతే తెలుగులో పెద్ద సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలు ఇప్పట్లో రిలీజ్ చేయడానికి మన నిర్మాతలు ఇష్టపడటం లేదు. ఆల్రెడీ గత వారం రిలీజైన సినిమాల రిజల్ట్ చూస్తే.. ఎగ్జామ్స్ టైమ్ లో రిలీజ్ చేయడం చేతులు కాల్చుకోవడమే అని స్పష్టమవుతోంది. అందుకే పెద్ద సినిమాలన్నీ ఏప్రిల్ కి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. మజిలీ అలాగే నాని జెర్సీ ఇక మహర్షి వంటి సినిమాలు సమ్మర్ హాలిడేస్ కి రెడీ అవుతున్నాయి. మరి F2 తరువాత ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English