ఉరుము ఉరిమి త్రివిక్రమ్‌పై పడింది!

ఉరుము ఉరిమి త్రివిక్రమ్‌పై పడింది!

మహేష్‌తో సుకుమార్‌ సినిమా కాన్సిల్‌ అయిపోవడంతో అల్లు అర్జున్‌కి వెంటనే సుకుమార్‌ చిత్రం మొదలు పెట్టుకునే సౌలభ్యం దక్కింది. అయితే త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ కమిట్‌ అయి వుండడం వల్ల సుకుమార్‌ చాలా కాలం వేచి చూడక తప్పదు. కానీ త్రివిక్రమ్‌ సినిమా ఇంతవరకు మొదలు కాలేదు. ఏదో కారణమ్మీద వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు సుకుమార్‌ లైన్లోకి రావడంతో త్రివిక్రమ్‌కి కంగారు పట్టుకున్నట్టే. కథాపరంగా బన్నీ అడిగిన మార్పులు సరిగా జరగడం లేదనే పుకార్లు వినిపిస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. కాకపోతే సుకుమార్‌ దగ్గర ఇమ్మీడియట్‌గా కథ రెడీగా లేదు. అతని కథ సిద్ధం కావడానికి జూన్‌ వరకు సమయం పడుతుందట. ఈ ఒక్క కారణం మీద త్రివిక్రమ్‌ గట్టెక్కేయవచ్చు.

కానీ వెనక సుకుమార్‌ సినిమా వుందనే ప్రెజర్‌ అయితే ఫీలవుతూ వుంటాడు. ఎందుకంటే సుకుమార్‌ గత చిత్రం రంగస్థలం కాగా, త్రివిక్రమ్‌ భారీ హిట్‌ ఇచ్చి చాలా కాలమవుతోంది. మహేష్‌ కోసం రాసుకున్న కథ తనకి వచ్చేసరికి అల్లు అర్జున్‌ ఇప్పుడు సుక్కూ సినిమా మొదలు పెట్టడానికి తహతహగా వున్నాడని వినిపిస్తోంది. ఏదేమైనా మహేష్‌ ఒక్క ట్వీట్‌తో చాలా మంది పెద్దలకి కుర్చీలు కదిలాయి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English