త్రిష కుక్కోపదేశం

త్రిష కుక్కోపదేశం

త్రిషకి వీధి కుక్కల మీద మమకారం నానాటికీ పెరిగిపోతోంది. సినిమాల గురించి కాకుండా విడిగా ఏం మాట్లాడినా కానీ అది వీధికుక్కలతోనే లింక్‌ అయి ఉంటోంది. అంతగా వీధి కుక్కలతో పెనవేసుకుపోయిన త్రిష తనకి కాబోయే వాడికి కూడా జంతు ప్రేమ ఉండి తీరాలని అంటోంది. జంతువులని ప్రేమించే వాడికి సాటి మనుషుల మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుందని త్రిష భావిస్తోంది.

ఇంకా తనకి కావాల్సిన వాడు దొరకలేదని, ఒకవేళ దొరికాడని తెలిస్తే అతను కూడా తనలా జంతువుల్ని ప్రేమించేవాడేనని ఫిక్స్‌ అయిపోవచ్చని త్రిష చెప్తోంది. సో... త్రిషని మీట్‌ అవ్వాలన్నా, లేక ప్రపోజ్‌ చేయాలన్నా వీధి కుక్కలని అడాప్ట్‌ చేసుకుంటే సరి. వీధి కుక్కలని ప్రేమించే వాడు మనుషుల్ని ఇంకా బాగా ప్రేమిస్తాడని, విలువ ఇస్తాడని తనకి తెలిసిన కుక్కోపదేశం చేస్తోంది. ఆమె కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాల గురించి పక్కన పెడితే త్రిష చేస్తున్న మంచి పనికి మాత్రం మెచ్చుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు