పచ్చని పొలాల్లో పోష్ పోరి

పచ్చని పొలాల్లో పోష్ పోరి

తొలిప్రేమ సినిమాతో కెరీర్ లొనే బెస్ట్ హిట్టందుకున్న రాశి ఖన్నా ఆ తరువాత అవకాశాలను బాగానే అందుకుంది. తెలుగులో ఫ్లాపులు వచ్చినా తమిళ్ అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. ఇకపోతే ఇదివరకులా అమ్మడు గ్లామర్ రోల్స్ లో కనిపించడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా శ్రీనివాస కల్యాణం లో అమ్మడు పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. కాని బోర్ కొట్టేసి.. ఇప్పుడు మళ్లీ పాత గేరే వేసినట్లుంది.

ఎందుకంటే అనవసరంగా తొలిప్రేమ - శ్రీనివాస కల్యాణం తరహాలో నాన్ గ్లామరస్ రోల్స్ కె పరిమితమవుతున్నట్లు ఒక ఫీలింగ్ వచ్చేసిందట. హిట్ అండ్ సక్సెస్ అనేది పక్కన పెడితే.. గ్లామర్ లుక్ లో కనిపించకపోతే అవకాశాలు తగ్గుతాయి అనే రోజులివి. అందుకే అమ్మడు మళ్ళీ తనకు ఇష్టమైన ఫార్మాట్ లోకి వచ్చినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం రాశి ఖన్నా వెంకీ మామా సినిమాలో నాటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ స్పాట్ ఫొటోని వదిలిన రాశి.. మళ్ళీ గ్లామర్ తో ఎటాక్ చేయబోతున్నట్లు ఓ క్లారిటీ ఇచ్చేసింది.

నాగ చైతన్య పక్కన పోష్ పోరిలా మెరావడానికి ఈ విధంగా కోనసీమలోని పచ్చని పొలాల్లో గ్లామర్ తో సెగలు రేపుతోంది. మరి ఈ దెబ్బతో జోరు పిల్ల ఎంతవరకు గ్లామర్ రోల్స్ ని పట్టేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English