బోయపాటిపై క్యాంప్‌ ముద్ర పడిపోయింది!

బోయపాటిపై క్యాంప్‌ ముద్ర పడిపోయింది!

టాప్‌ డైరెక్టర్లకి క్లోజ్‌ అయిన హీరోలు వుండొచ్చు కానీ ఫలానా వారికే వీరు విశ్వాసపాత్రులు అనే పేరు రాకూడదు. ఉదాహరణకి పవన్‌కళ్యాణ్‌కి త్రివిక్రమ్‌ ఆప్తుడు. అలాగే తారక్‌కి రాజమౌళి చాలా కావాల్సినవాడు. అలా అని సదరు దర్శకులకి ఆ హీరోలతోనే బాగుంటారనే పేరు లేదు.

ఎవరితో పని చేసినా తమ శక్తివంచన లేకుండా పని చేసి మంచి రిజల్ట్‌ ఇవ్వడానికి కృషి చేస్తారు. ఫలానా హీరోకి బయాస్డ్‌గా వుంటాడనే పేరు వల్ల ఏ దర్శకుడి గుడ్‌విల్‌ అయినా దెబ్బతింటుంది. కానీ ఎందుకో బోయపాటి శ్రీనుపై మాత్రం 'వినయ విధేయ రామ' నిర్మాణంలో వున్న దగ్గర్నుంచీ సినిమాని చెడగొడుతున్నాడనే పుకార్లు వినిపించాయి.

ఎన్టీఆర్‌ బయోపిక్‌కి పోటీగా వస్తోన్న చిత్రం కావడంతో, బాలకృష్ణకి బోయపాటి బాగా సన్నిహితం కావడంతో ఈ పుకార్లకి కాస్త లాజిక్‌ యాడ్‌ అయింది. సినిమా బాగా తీసినట్టయితే ఈ పుకార్లు గాల్లో కలిసిపోయేవి. కానీ బోయపాటి తన కెరియర్లోనే మరచిపోతగ్గ చిత్రాన్ని అందించడంతో కావాలనే చేసాడనే వారికి గొంతు పెరిగింది. అందుకు ఆ సినిమా ఇన్‌సైడర్స్‌ కూడా ఊతమిచ్చారనే ప్రచారం కూడా వుంది.

వెంటనే బాలకృష్ణతో సినిమా ఓకే చేసుకోవడం, అంతకంటే ముందు టీడీపీ ప్రచార పర్వంలో భాగం పంచుకోవడం కూడా బోయపాటిపై ఫలానా క్యాంప్‌ వాడనే ముద్రని బలంగా వేసేస్తున్నాయి. మరి దీనినుంచి బయటపడి మిగతా హీరోల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఎలా పొందుతాడో, ఎప్పటికి ఈ ముద్ర పోగొట్టుకుంటాడో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English