అప్పుడే కర్చీఫ్‌ వేసేసారుగా

అప్పుడే కర్చీఫ్‌ వేసేసారుగా

పుల్వామా ఎటాక్‌కి ప్రతిగా భారత వైమానిక దళం పాకిస్థాన్‌లో బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావారాలపై దాడి చేసిందని, ఆ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించుకుంది. కనీసం మూడు వందల మంది ఆతంకవాదులు చనిపోయారని మీడియా గట్టిగా ప్రచారం చేసింది. అయితే ఇండియా క్లెయిమ్స్‌కి తగ్గట్టు అక్కడ ప్రాణనష్టం జరగలేదనేది ఇంటర్నేషనల్‌ మీడియా రిపోర్టు. 'నో మాన్స్‌ లాండ్‌'లో బాంబులు వేసారని, టార్గెట్‌ మిస్‌ అయ్యారని వారు చెబుతున్నారు. పాకిస్తాన్‌లో చెట్లని నాశనం చేసారంటూ అక్కడి వాళ్లు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ప్రాణ నష్టం మాట ఎలా వున్నా పాకిస్తాన్‌లోకి చొరబడి దాడి చేసి వెనక్కి రాగలమనే బలమైన సంకేతాలని భారత వైమానిక దళం ఈ దాడులతో నిరూపించింది. అందుకే పాకిస్తాన్‌ బాగా అలర్ట్‌ అయింది.

ఇదిలావుంటే ఈ దాడుల్లో ఉగ్రవాదులు నిజంగా అంతమంది చనిపోయినట్టయితే పుల్వామాకి ప్రతీకారం అనిపిస్తుందా లేక భారత వైమానిక దళ సామర్ధ్యం నిరూపించుకుంటే అదే ప్రతిష్ట నిలబెడుతుందా అనేది వ్యక్తిగత అభిప్రాయం బట్టి ఆధారపడుతుంది. కాకపోతే బాలీవుడ్‌కి మాత్రం ఈ మాత్రం స్టోరీ చాలు. అందులోను 'ఊరి సర్జికల్‌ స్ట్రైక్‌' చిత్రానికి ఇండియాలోనే రెండు వందల యాభై కోట్ల నెట్‌ వసూళ్లు రావడంతో 'బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌' కథపై ఆల్రెడీ కసరత్తు మొదలైపోయింది. వందల కోట్ల పొటెన్షియల్‌ వున్న కథని వాస్తవాలకి అనుగుణంగా వదిలేసుకోరుగా మరి. అందుకే ఆ కథపై సంజయ్‌ లీలా భన్సాలీ సంస్థ ఆధ్వర్యంలో ప్రీ ప్రొడక్షన్‌ మొదలయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English