ప్రభాస్‌ షాడోలోంచి బయటకి వచ్చేదెలా?

ప్రభాస్‌ షాడోలోంచి బయటకి వచ్చేదెలా?

బాహుబలి చిత్రానికి హీరో ప్రభాస్‌ అయినా కానీ సక్సెస్‌ క్రెడిట్‌లో ఎక్కువ షేర్‌ రాజమౌళికి వెళ్లింది. అందుకేనో ఏమో తన తదుపరి రెండు చిత్రాలకీ అంతగా తెలియని కుర్రాళ్లని పెట్టుకున్నాడు ప్రభాస్‌. దీంతో సదరు చిత్రాలు ప్రభాస్‌ సినిమాలుగానే పబ్లిసిటీ దక్కించుకుంటున్నాయ్‌. సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌ ఎవరనేది సినిమాలని బాగా కీన్‌గా ఫాలో అయ్యే వారికి తప్ప సగటు సినిమా ప్రేక్షకులకి తెలియదు.

'రన్‌ రాజా రన్‌' అనే చిన్న చిత్రం తీసిన సుజీత్‌కి ఏకంగా మూడు వందల కోట్ల ప్రాజెక్ట్‌ని అప్పగించేసారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి దర్శకుడు అయినా కానీ సుజీత్‌కి తగిన పబ్లిసిటీ రావడం లేదు. జనం అతడిని గుర్తు పట్టడం లేదు. అందుకేనేమో 'సాహో' రెండవ మేకింగ్‌ టీజర్‌లో తన షాట్స్‌ ఎక్కువ కవర్‌ అయ్యేలా చూసుకున్నాడు సుజీత్‌.

ఈ విషయాన్ని ప్రభాస్‌తో పాటు నిర్మాతలు యువీ వాళ్లు కూడా గమనించినా కానీ కుర్రాడు ఎలివేట్‌ అవ్వాలని చూస్తున్నాడులెమ్మని ఆ షాట్స్‌ అలా వుండనిచ్చారట. ఎలాగో ముందు, ముందు రాబోయేవి అన్నీ సినిమా విజువల్సే కనుక తానెంత కష్టపడిందీ చూపించుకునే వీలు ఇప్పుడే చిక్కుతుందని భావించి సుజీత్‌ ఈ అవకాశాన్ని వాడేసుకున్నట్టున్నాడు. దీనిని బట్టి ఈ సినిమా ప్రమోషన్స్‌లో తనకి ఫుల్‌ కవరేజ్‌ దక్కేలా చూసుకుంటాడేమో ఈ టాలెంటెడ్‌ యంగ్‌ డైరెక్టరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English