‘2.0’కి అంత సీనుందా?

‘2.0’కి అంత సీనుందా?

అంతన్నాడింతన్నాడే అన్న పాట గుర్తుకొచ్చింది జనాలకు ‘2.0’ సినిమా చూస్తే. ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ అనిపించుకున్న ఈ చిత్రం.. హైయెస్ట్ గ్రాసర్ రికార్డుకు చాలా దూరంలో ఆగిపోయింది. పెట్టిన బడ్జెట్‌కి సినిమాలో కంటెంట్‌కి పొంతన కుదరకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. రికార్డులు బద్దలు కొట్టడం సంగతలా ఉంచితే.. పెట్టుబడి కూడా వెనక్కి తేలేక ఫ్లాప్ మూవీగా నిలిచింది ‘2.0’.

ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.375 కోట్లకు అమ్మితే బయ్యర్లు వెనక్కి తెచ్చుకున్నది రూ.300 కోట్లే. అంటే రూ.75 కోట్ల నష్టమన్నమాట. ‘2.0’ ఓవరాల్ బడ్జెట్ కోణంలో చూస్తే ఈ నష్టం తక్కువే కావచ్చు కానీ.. మామూలుగా చూస్తే అది భారీ మొత్తమే. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయినకాడికి బడ్జెట్ పెట్టిన లైకా ప్రొడక్షన్స్ వాళ్లు కూడా నష్టాలు మూటగట్టుకోక తప్పలేదు. ఐతే చైనాలో రిలీజ్ చేయడం ద్వారా కొంత మేర నష్టాలు భర్తీ చేసుకోవాలని ప్లాన్ చేశారు.

గత ఏడాదే చైనా హక్కుల్ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు అమ్మారు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మొత్తం 57 వేల స్క్రీన్లలో సినిమా రిలీజవుతున్నట్లు.. అందులో త్రీడీవీ 47 వేలు అన్నట్లుగా ఘనమైన ప్రకటనలు ఇస్తున్నారు. ఈ న్యూస్ ఇంతకుముందే బయటకు వచ్చింది కానీ.. అప్పటికి ఇండియాలో రిజల్ట్ ఏంటో తెలియలేదు. కానీ ఇక్కడ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.

మరి ఇండియాలోనే ఆడని సినిమా చైనాలో మాత్రం ఏం ఆడుతుందో అన్న సందేహాలున్నాయి. చైనాలో చారిత్రక విజయం సాధించిన ‘దంగల్’ సినిమాకు కూడా అన్ని స్క్రీన్లు దక్కలేదు. అలాంటిది ఇండియాలో ఫ్లాప్ అయిన నెగెటివిటీ మధ్య రిలీజవుతున్న ‘2.0’ను చైనాలో నిజంగా అన్ని స్క్రీన్లలో రిలీజ్ చేస్తారా అన్నది సందేహం. అసలు ఈ సినిమాకు అక్కడ బజ్ క్రియేట్ చేయగలుగుతున్నారా అన్నదీ డౌటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English