బెల్లంకొండ బాగా తగ్గాడు

బెల్లంకొండ బాగా తగ్గాడు

తన సినిమాలో ఏమి వున్నా లేకపోయినా స్టార్‌ హీరోయిన్‌ అయితే ఖచ్చితంగా వుండాలని పట్టుబట్టే బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇప్పుడు బాగా తగ్గాడు. వరుస ఫ్లాపులు రావడం వలనో లేక ఎంత పెద్ద హీరోయిన్‌ వున్నా ఎక్స్‌ట్రా బెనిఫిట్‌ లేదని రియలైజ్‌ అవడం వలనో ఇక టాప్‌ హీరోయిన్లు మాత్రమే తన సినిమాలో వుండాలని అతను డిమాండ్‌ చేయడం లేదు. అందుబాటులో వున్న హీరోయిన్లని తీసుకున్నా ఇప్పుడు శ్రీనివాస్‌తో పాటు అతని డాడీ బెల్లంకొండ సురేష్‌ కూడా ఓకే అంటున్నారు.

పెద్ద హీరోయిన్‌ని పెట్టుకుని ఆమెకి ఓ కోటి రూపాయల పారితోషికం ఇచ్చే బదులు పాతిక లక్షల్లో వచ్చే హీరోయిన్లని ప్రిఫర్‌ చేస్తున్నారు. తద్వారా బెల్లంకొండ సినిమాల బడ్జెట్‌ మరికాస్త తగ్గింది. ఇప్పటికే అతని సినిమాలకి అదనపు హంగులు, భారీ నిర్మాణ విలువలు అన్నీ తగ్గించేసి పదిహేను కోట్ల బ్రాకెట్‌లోకి తీసుకొచ్చేసారు. కానీ అతని గత చిత్రం కవచం అది కూడా సాధించలేకపోవడంతో ఇప్పుడు అతడి సినిమాలని పది కోట్ల మార్జిన్‌లోకి తీసుకొస్తున్నారు. మరి ఇంతగా బడ్జెట్‌ తగ్గించాక అయినా శ్రీనివాస్‌ విజయాలు అందిస్తాడో లేదో? అతని సక్సెస్‌ రేట్‌ మాట ఎలా వున్నా అతనికోసం బారులు తీరే నిర్మాతల సంఖ్య అయితే రోజు రోజుకీ పెరుగుతూ పోతోంది, అదేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English