సాహో.. ఎన్నాళ్ళీ తెరచాటు యవ్వారం?

సాహో.. ఎన్నాళ్ళీ తెరచాటు యవ్వారం?

బాహుబలి తర్వాత ప్రభాస్‌ సినిమా కాబట్టి సాహో కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. దేశమంతా చూడాలంటే అల్లాటప్పా సినిమా కాకూడదని భారీ బడ్జెట్‌తో జేమ్స్‌బాండ్‌ తరహా యాక్షన్‌ సినిమా తీస్తున్నారు. రెండు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్‌ ఎలా వుంటుందనేది మేకింగ్‌ క్లిప్పింగుల ద్వారా చూపిస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి ప్రోపర్‌ టీజర్‌ రాలేదు. ప్రభాస్‌ బర్త్‌డేకి, శ్రద్ధా కపూర్‌ బర్త్‌డేకి చెరో మేకింగ్‌ వీడియో క్లిప్పింగ్‌ వదిలారు. అందులో ప్రభాస్‌కి చెందిన రెండు షాట్స్‌ చూసి ఫాన్స్‌ సంబరపడుతున్నారే కానీ అసలు ఈ సినిమా లుక్‌ అండ్‌ ఫీల్‌ ఎలా వుంటుందనేది చూపించడం లేదు.

మరి ఎప్పటికి ఈ చిత్రం అసలు పబ్లిసిటీ స్టార్ట్‌ చేస్తారనేది ఇంకా తెలియడం లేదు. ఆగస్టులో విడుదలయ్యే ఈ చిత్రాన్ని అన్ని లాంగ్వేజెస్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే పబ్లిసిటీ పరంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా వుండాలి. కేవలం తెలుగు సినిమా అంటే విడుదలకి ముందు సందడి చేసినా చాలు. కానీ పాన్‌ ఇండియా మార్కెట్‌ కావాలంటే లేట్‌గా బాజా మొదలుపెడితే కుదరదు. ఇకనైనా మీన మేషాలు లెక్కించకుండా త్వరలోనే సరయిన టీజర్‌ వదులుతారని ఫాన్స్‌ ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English