సాహో రిలీజ్ డేట్‌పై మళ్లీ సస్పెన్స్

సాహో రిలీజ్ డేట్‌పై మళ్లీ సస్పెన్స్

సాహో.. ఏడాది దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తన్న సినిమా. ‘బాహుబలి’ లాంటి మైల్ స్టోన్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మొదలయ్యే సమయానికే అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. దీని ప్రోమోలు చూశాక అవి మరింత పెరిగాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ రూపొందుతున్న ఈ చిత్రం కోసం అన్ని భాషల వాళ్లూ ఎంతో ఆసక్తితో ఉన్నారు.

ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతుందని ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ డేట్‌కు అందరూ ఫిక్సయిపోయి ఉన్నారు. ఐతే ఈ రోజు రిలీజ్ చేసిన ‘సాహో’ ఛాప్టర్-2 వీడియో చూశాక మళ్లీ రిలీజ్ డేట్ విషయంలో సందేహాలు కలుగుతున్నాయి. ఇందులో 2019 రిలీజ్ అని మాత్రమే వేశారు. ఆగస్టు 15 డేట్ వేయలేదు. దీంతో సినిమా ఏమైనా వాయిదా పడుతోందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

‘సాహో’ స్థాయి సినిమాలు ఒక పట్టాన పూర్తి కావు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆలస్యం జరుగుతుంటుంది. ఈ చిత్ర టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు సమాచారం. దీంతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టారు. ఐతే ఆ పనులపై ఒక అంచనా లేకపోవడంతో ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయగలమో లేదో అన్న అనుమానాలతో చిత్ర బృందం ఛాప్టర్-2 వీడియోలో డేట్ ప్రకటించలేదని తెలుస్తోంది. ఐతే తెలుగు వరకు రిలీజ్ చేసేట్లయితే డేట్ మార్చుకోవడంలో ఇబ్బందేమీ లేదు.

కానీ ఈ చిత్రం హిందీ, తమిళంలోనూ రిలీజ్ చేయాలి. హిందీలో ఒక డేట్ ఇచ్చి ఎలా పడితే అలా మార్చుకోవడం కుదరదు. కాబట్టి ఆగస్టు 15 విషయంలో రాజీ పడితే అక్కడి జనాలు ఊరుకోరు. ఇంకో డేట్ దొరకడం కష్టం. మరి ‘సాహో’ టీం అక్కడ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఏం చేసైనా ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేస్తేనే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English