తెనాలి పిల్లకి మెగా ఆఫర్‌

తెనాలి పిల్లకి మెగా ఆఫర్‌

తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన శోభిత దూళిపాళ అందాల పోటీల్లో ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చుకుని తర్వాత సినీ నటిగా కెరియర్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. సెక్సీ అనే పదానికి డెఫినిషన్‌లా వుండే శోభితకి ఎందుకో ఇంతవరకు సరయిన బ్రేక్‌ రాలేదు. గూఢచారి అనే హిట్‌ సినిమాలో నటించినా కానీ తెలుగులో తగినన్ని ఆఫర్స్‌ రాలేదు. అయితే నిరాశ పడకుండా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకుని రెండు సిరీస్‌లో నటించింది. ఈలోగా ఆమెకి బాలీవుడ్‌నుంచి ఒక భారీ చిత్రం నుంచి ఆఫర్‌ రానే వచ్చింది. సూపర్‌స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటించే 'లక్ష్మి' అనే చిత్రంలో శోభితకి కథానాయికగా ఛాన్స్‌ వచ్చింది.

కాంచన 2కి రీమేక్‌ అయిన ఈ చిత్రానికి హిందీలో కూడా లారెన్స్‌ దర్శకత్వం వహించనున్నాడు. స్త్రీ, గోల్‌మాల్‌ 3 లాంటి హారర్‌ కామెడీ చిత్రాలకి భారీ విజయం లభించడంతో కాంచన2 రీమేక్‌ మళ్లీ తెరమీదకి వచ్చింది. తెలుగులో విడుదలైన కొత్తలోనే రీమేక్‌ చేయాలని భావించినా కానీ ఎందుకో పక్కన పెట్టేసారు. కానీ హారర్‌ కామెడీ చిత్రాలకి వంద కోట్లకి పైగా వసూళ్లు వస్తుండడంతో కాంచన 2 రీమేక్‌కి ఇదే రైట్‌ టైమ్‌ అని భావిస్తున్నారు. ఈ చిత్రంతో అయినా శోభిత ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రానంత బిజీ అయిపోతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English