ఆ సినిమా రాత మార్చేసిన తారక్‌!

ఆ సినిమా రాత మార్చేసిన తారక్‌!

వరుస పరాజయాల వల్ల ఒక్కోసారి ఎంత కష్టపడి చేసినా, మంచి ప్రోడక్ట్‌ రెడీ చేసినా కానీ కాన్ఫిడెన్స్‌ వుండదు. కళ్యాణ్‌రామ్‌ '118' రిలీజ్‌ ముందు అలాగే అపనమ్మకంతో వున్నాడట. సినిమా బాగానే వచ్చిందనిపించినా కానీ దానిని ఎవరికైనా చూపించి ఒపీనియన్‌ అడగడానికి భయపడ్డాడట. దిల్‌ రాజుకి సినిమా చూపిస్తే కనుక అతను హక్కులు తీసుకుంటాడని, తద్వారా మార్కెటింగ్‌ గురించి బెంగ అక్కర్లేదని కళ్యాణ్‌రామ్‌తో చెబితే, దిల్‌ రాజుకి చూపించడానికి జంకాడట. అతనికి కానీ సినిమా నచ్చకపోతే మరింతగా నీరసించిపోతామని, రిస్క్‌ ఎంతయినా స్వయంగా విడుదల చేసుకుందామని అన్నాడట. అయితే ఈలోగా ధైర్యం చేసి సోదరుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కి చూపించాడట.

సినిమా చూసిన తారక్‌ బాగుందని చెప్పడమే కాకుండా దిల్‌ రాజుకి స్వయంగా కాల్‌ చేసి సినిమా చూడమన్నాడట. తారక్‌ అంత ఇదిగా చెప్పాడంటే సినిమాలో విషయం వుండే వుంటుందని వచ్చిన దిల్‌ రాజు 118 చూడగానే రైట్స్‌ ఎంతకి అమ్ముతారంటూ టాక్స్‌ మొదలు పెట్టాడట. ఇప్పుడు విడుదలయిన తర్వాత కూడా స్పందన బాగుండడంతో కళ్యాణ్‌రామ్‌ ఉప్పొంగిపోతున్నాడు. జై లవకుశతో తన సంస్థని ఆదుకున్న తారక్‌ ఇప్పుడు ఈ చిత్రానికి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చి నటుడిగా తగ్గుతోన్న కాన్ఫిడెన్స్‌కి బూస్ట్‌ ఇచ్చాడని తమ్ముడిపై సన్నిహితుల వద్ద ప్రశంసలు కురిపిస్తున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English