రంగస్థలం తర్వాత గాలి పోయింది

రంగస్థలం తర్వాత గాలి పోయింది

రంగస్థలంతో నాన్‌ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌ తీసిన ఘనత దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్‌కి అప్పటివరకు వరుసగా మూడు భారీ విజయాలు వచ్చాయి. ఇక ఇండస్ట్రీలో నెక్స్‌ట్‌ కింగ్‌ మేకర్స్‌ వీళ్లే అన్నంతగా ధగధగలాడిన మైత్రి మూవీ మేకర్స్‌కి సవ్యసాచి, అమర్‌ అక్బర్‌ ఆంటోనితో గట్టి దెబ్బ తగిలింది. అంతవరకు భారీ చిత్రాలకి లెక్క, పత్రం లేదన్నట్టు ఖర్చు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్‌కి ఫ్లాప్‌ సినిమాలతో ఎలా లాస్‌ వస్తుందనేది తెలిసి వచ్చింది. దీంతో బడ్జెట్‌ కంట్రోల్‌లో పెట్టేసారు. ప్రస్తుతం తీస్తోన్న మిడిల్‌ రేంజ్‌ సినిమాలు చిత్రలహరి, డియర్‌ కామ్రేడ్‌కి ఆచి తూచి ఖర్చు పెడుతున్నారని తెలిసింది.

అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కనిపించిన హీరోకి, దొరికిన దర్శకుడికి అడ్వాన్స్‌ ఇచ్చేసి ఒప్పందాలు చేసేసుకున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం అంటూ వరుస విజయాలు వచ్చేసరికి ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి తీసుకోవడానికి గానీ, వారితో వెంటనే సినిమా తీయడానికి గానీ ప్రయత్నించలేదు. కానీ ఒక్కసారి నష్టాలు వచ్చిన తర్వాత ఇచ్చిన అడ్వాన్సులు గుర్తొచ్చి అన్నీ వెనక్కు తీసుకునే పనిలో పడ్డారు. పవన్‌కళ్యాణ్‌కి అయిదు కోట్లపైనే అడ్వాన్స్‌ ఇచ్చిన మైత్రి వాళ్లు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అవి పూర్తయ్యాక పవన్‌ మళ్లీ సినిమాలు చేస్తే మొదటి చిత్రం తమకే చేస్తాడని ఆశ పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English