పంది పిల్లతో అక్కడో సినిమా వస్తోంది

పంది పిల్లతో అక్కడో సినిమా వస్తోంది

దర్శకుడిగా ఆరంభం నుంచి వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నాడు రవిబాబు. ఐతే ఈ మధ్య అతడి సినిమాలు అస్సలు వర్కవుట్ కావడం లేదు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా మీద రెండేళ్లకు పైగా పని చేశాడతను. అదే.. అదుగో. ఒక పంది పిల్లను హీరోగా పెట్టి రవిబాబు తీసిన సినిమా ఇది. ఇంత కష్టపడి తీస్తే సినిమా రెండు రోజులు కూడా ఆడలేదు. రవిబాబు కెరీర్లోనే కాదు.. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా ‘అదుగో’ పేరు తెచ్చుకుంది. రవిబాబు పంది పిల్లను పెట్టి సినిమా తీశాడంటే కామెడీ ఓ రేంజిలో ఉంటుందని.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందని అంతా అనుకున్నారు. కానీ సినిమాకు వెళ్లిన వాళ్లకు ‘అదుగో’ నరకం చూపించింది. ఐతే ‘అదుగో’కు రీమేకా ఏంటో తెలియదు కానీ.. తమిళంలో ఇదే తరహా సినిమా ఒకటి వస్తుండటం విశేషం.

పన్ని కుట్టి (పంది పిల్ల అని అర్థం) పేరుతో తమిళంలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. కమెడియన్‌గా ఈ మధ్య మాంచి రైజింగ్‌‌లో ఉన్న యోగిబాబు ప్రధాన పాత్ర పోషించాడు. కరుణాకరన్ అనే మరో మంచి కమెడియన్ ఇందులో కీలక పాత్ర చేశాడు. పంది పిల్లను పట్టుకోవడం కోసం ఒక గ్యాంగ్ అంతా కలిసి పరుగులు పెడుతున్నట్లుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది చూస్తే తెలుగు జనాలకు ‘అదుగో’నే గుర్తుకొస్తోంది. ఐతే యాదృచ్ఛికంగా ఈ పోలికి కలిసినా కలిసి ఉండొచ్చు. ఐతే ‘అదుగో’ సినిమా తీసినంత ఆషామాషీగా దాన్ని తెరకెక్కించి ఉండరనే భావించవచ్చు. తమిళంలో ఇలాంటి వైవిధ్యమైన.. చిన్న చిన్న కాన్సెప్ట్‌లు తీసుకుని భలేగా కామెడీ పండిస్తుంటారు. పంది పిల్లతో సినిమా అనగానే మన ‘అదుగో’ గురించి తెలుసుకునే ఉండొచ్చు. ఇక్కడ రిజల్ట్ చూసి అయినా.. అక్కడ బెటర్‌గా సినిమా తీసి ఉంటారనే అనుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English