నాన్నా తారక్.. నీ నమ్మకం నిజమైంది

నాన్నా తారక్.. నీ నమ్మకం నిజమైంది

సినిమా తీసిన ప్రతి వాళ్లూ తమ చిత్రం అద్భుతం అనే అంటారు. ఆ చిత్ర బృందానికి సన్నిహితులైన వ్యక్తులు ముందే ప్రివ్యూ చూసి సినిమా అద్భుతంగా వచ్చిందని.. సూపర్ హిట్టవుతుందని అంటుంటారు. ఐతే ఈ మాటల్ని నమ్మడానికేమీ లేదు. ఇలా గొప్పగా చెప్పిన సినిమాలు చాలానే తర్వాత బోల్తా కొట్టాయి. ఇటీవల ‘118’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ చాలా పాజిటివ్‌గా చెప్పాడు.

తాను సినిమా చూశానని.. తన అన్న కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అవుతుందని.. ఇది పెద్ద హిట్టవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఐతే ఎన్టీఆర్ చెప్పిన రేంజిలో కాకపోయినా సినిమా అయితే డీసెంట్‌గా ఉన్న మాట వాస్తవం. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టేసింది. ఇందులో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ప్రి రిలీజ్ ఈవెంట్లో తన తమ్ముడి మాటల్ని గుర్తు చేసుకున్నాడు.

‘‘నాన్నా తారక్.. నీ నమ్మకం నిజమైంది. నువ్వన్నట్లే సినిమా మంచి విజయం  సాధిస్తోంది. చాలా థ్యాంక్స్’’ అని కళ్యాణ్ రామ్ అన్నాడు. ప్రేక్షకుల కంటే  ముందు తారక్ ఈ సినిమా చూసి పాజిటివ్‌గా చెప్పాడని.. కచ్చితంగా ఇది  విజయవంతమవుతుందని తమతో ధీమాగా చెప్పాడని.. ఇప్పుడు అదే జరిగిందని కళ్యాణ్  చెప్పాడు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను టేకప్ చేసి రిలీజ్  చేయడం సంతోషకరమని.. ఆయన ఇంతకుముందు తన ‘పటాస్’ సినిమాను కూడా రిలీజ్  చేశారని.. ‘118’ ఆయనకు భారీ లాభాలు అందించాలని కోరుకుంటున్నానని కళ్యాణ్  అన్నాుడ. ‘118’కు నివేథా థామస్ బ్యాక్ బోన్ అని.. ఆమె నటన ఎమోషనల్‌గా  అందరినీ టచ్ చేసిందని కళ్యాణ్ చెప్పాడు. దర్శకుడు గుహన్ తన కెరీర్లో  నిలిచిపోయే సినిమా అందించాడన్నాడు. ప్రేక్షకులకు ఒక కొత్త సినిమా ఇవ్వాలనే  ఉద్దేశంతో చేసిన చిత్రం ‘118’ అని కళ్యాణ్ రామ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English