కంగనతో నటించడానికి ముందుకొచ్చాడా?

కంగనతో నటించడానికి ముందుకొచ్చాడా?

బాలీవుడ్లో ఇప్పుడు కంగనా రనౌత్ పేరు చెబితే అందరూ అమ్మో అంటున్నారు. తనతో పని చేసిన చాలామందితో ఆమె సున్నం పెట్టుకుంది. కొన్నిసార్లు పని చేయని వాళ్లను కూడా కెలికింది. కంగనాతో సినిమా చేసి మన క్రిష్ ఎలా తల బొప్పి కట్టించుకున్నాడో తెలిసిందే. ఇక ఆమెతో సినిమా చేయనందుకు కరణ్ జోహార్ టార్గెట్ అయ్యాడు. కరణ్‌కు బంధు ప్రీతి ఎక్కువ అని.. అతను తనతో అందుకే సినిమా చేయలేదని కంగనా ఆరోపించింది.

మరోవైపు బాలీవుడ్‌కు మూల స్తంభాలైన ఖాన్ త్రయం మీద కూడా ఆమె గతంలో సెటైర్లు వేసింది. వాళ్లను తక్కువ చేసి మాట్లాడింది. ఐతే ఇప్పుడు ఖాన్ త్రయంలో ఒకడు.. కరణ్ జోహార్‌కు చాలా సన్నిహితుడు అయిన షారుఖ్ ఖాన్.. కంగనాతో కలిసి నటించడానికి ముందుకొచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

కంగనా ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో షారుఖ్ ఓ క్యామియో రోల్ లాంటిది చేస్తున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. షారుఖ్ క్యామియో రోల్ చేయడానికి కూడా రేంజ్ చూసుకునే దిగుతాడు. కానీ గతంతో పోలిస్తే అతడి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. మార్కెట్ బాగా దెబ్బ తింది. కాబట్టే కంగనా సినిమాకు కూడా ఓకే చెప్పాడంటున్నారు.

కంగనాతో ప్రేమాయణం నడిపి.. ఆమెతో తర్వాత తీవ్రంగా గొడవ పడ్డ హృతిక్ రోషన్‌కు, షారుఖ్‌కు వైరం ఉంది. ఈ నేపథ్యంలో అతడిని టీజ్ చేయడానికి కూడా షారుఖ్ ఈ సినిమా చేస్తుండొచ్చంటున్నారు. ‘మెంటల్ హై క్యా’ సినిమాకు మన రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’.. ‘సైజ్ జీరో’ లాంటి డిజాస్టర్లు తీసిన ప్రకాష్.. ఈసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English