ఆ ఫ్యామిలీ సమంతకి రుణ పడాలి

ఆ ఫ్యామిలీ సమంతకి రుణ పడాలి

కొందరు హీరోలకి స్టాండర్డ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టులుంటారు. అలాగే కొందరు హీరోయిన్లకి కూడా ఒకే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ వాయిస్‌ అందిస్తుంటారు. అయితే తమకి వాయిస్‌ అందించే వారికి ఏదైనా చేయాలని తపించే వాళ్లు చాలా తక్కువ. సమంతకి వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా చిన్మయి చాలా చిత్రాలకి ఆమెకి గాత్రదానం చేసింది. చిన్మయి వాయిస్‌ వింటే అది సమంత వాయిస్‌ అనుకునేంతగా వారి జోడీ పాపులర్‌ అయింది. ఇప్పుడు సమంత డబ్బింగ్‌ వద్దంటూ సొంతంగా మాట్లాడుకుంటోంది కానీ చిన్మయితో అనుబంధం మాత్రం కొనసాగిస్తోంది.

ఆమె భర్త రాహుల్‌ రవీంద్రన్‌తో కూడా సమంతకి మంచి స్నేహం వుంది. అతను దర్శకత్వం వహించిన 'చి||ల||సౌ' చిత్రాన్ని సమంత తన మావయ్య నాగార్జునతో కొనిపించింది. అంతే కాదు అతనికి ఇపుడు మన్మథుడు సీక్వెల్‌ని నాగార్జునతో తీసే అవకాశం దక్కింది. మామూలుగా అయితే అతడికి ఇంత పెద్ద అవకాశం రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ సమంత రికమండేషన్‌ వల్ల అతను ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్‌ చేపట్టాడు. ఈ చిత్రంలో సమంత కూడా ఒక అతిథి పాత్ర చేస్తానని చెప్పిందట. తన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కోసం ఇంత చేసే హీరోయిన్‌ మరెవరూ వుండకపోవచ్చు కదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English