బాలకృష్ణని వదలని కళ్యాణ్‌!

బాలకృష్ణని వదలని కళ్యాణ్‌!

బాలకృష్ణతో 'ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌' బ్యానర్‌లో సినిమా నిర్మించాలనేది నందమూరి కళ్యాణ్‌రామ్‌ కల. తాతయ్య పేరు మీద స్థాపించిన బ్యానర్లో తనకి అత్యంత ఇష్టమైన బాబాయ్‌తో ఒక సినిమా అయినా తీయాలని కళ్యాణ్‌రామ్‌ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో తీద్దామనుకున్న సినిమా 'జై లవకుశ'తో నెరవేరిపోగా, ఇంతకాలం బాలకృష్ణతో తమ కుటుంబానికి విబేధాలు వుండడంతో కళ్యాణ్‌రామ్‌ ఈ కల నెరవేరలేదు. అయితే ఇప్పుడు బాలయ్యతో కళ్యాణ్‌రామ్‌ సత్సంబంధాలు మెయింటైన్‌ చేస్తున్నాడు. తారక్‌ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నా కానీ కళ్యాణ్‌రామ్‌ మాత్రం బాబాయ్‌తో నిత్యం కాంటాక్ట్‌లో వుంటున్నాడు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో హరికృష్ణ క్యారెక్టర్‌ని ఎలాంటి పారితోషికం తీసుకోకుండా చేసిన కళ్యాణ్‌రామ్‌ తన తాజా చిత్రం 118 ప్రీ రిలీజ్‌ వేడుకకి కూడా బాలయ్యని ఆహ్వానించాడు. త్వరలోనే బాలకృష్ణతో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో సినిమా చేయడం కోసం కళ్యాణ్‌రామ్‌ ప్రయత్నాల్లో వున్నాడు. పలువురు దర్శకులతో మాట్లాడుతూ బాలయ్యకి సరిపోయే కథ కోసం అన్వేషిస్తున్నాడు. అన్నీ కుదిరితే బాబాయ్‌ని కలిసి తన కల నెరవేర్చుకోవాలని ఆరాట పడుతున్నాడు. అతడిపై బాలయ్య ఇప్పుడు చూపిస్తోన్న వాత్సల్యానికి తప్పకుండా సినిమా చేస్తాడనే అనుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English