అసలు 'ఎవడు'లో ఎవడు ఎవడు..!

అసలు 'ఎవడు'లో ఎవడు ఎవడు..!

తెలుగు నటుల్ని తగ్గించేసి, పరభాషా నటుల్ని మోస్తున్న మన చిత్ర పరిశ్రమలో ఎంతో టాలెంట్‌ ఉండి కూడా చిన్న సినిమాలకే పరిమితమైపోయాడు సాయికుమార్‌. ప్రస్థానం, సామాన్యుడు చిత్రాల్లో అద్భుతమైన విలనీ ప్రదర్శించినా కానీ సాయికుమార్‌ని మన పెద్దలు గుర్తించలేదు. అయితే రామ్‌ చరణ్‌ నటిస్తున్న 'ఎవడు' చిత్రంతో సాయికుమార్‌కి పెద్ద బ్రేక్‌ లభించనుంది. ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌గా సాయికుమార్‌ నటిస్తున్నాడు.

ఇలాంటి పాత్రలకి ప్రకాష్‌రాజ్‌ లేదా వేరే ఇతర భాషా నటులని ఎంచుకుంటున్నారు. ఈ పాత్రకి సాయికుమార్‌ సరిపోతారని, అతనికి అవకాశమివ్వాలని చరణ్‌ సూచించాడట. అతని ఆలోచన ఎవడు బృందానికి నచ్చి సాయికుమార్‌కి ఇందులో కీలక పాత్రనిచ్చారట. ఇకపై సాయికుమార్‌ని పెద్ద సినిమాలకి కూడా కన్సిడర్‌ చేసే విధంగా ఇది అతనికి చాలా పెద్ద బ్రేక్‌ ఇస్తుందని ఇండస్ట్రీ వాసులు చెబుతున్నారు. ఈ సినిమాలో  'ఎవడు' అనేది సాయికుమార్‌ క్యారెక్టరేనని, హిందీలో గజిని చిత్రంలో విలన్‌ పేరు గజిని అయినట్టు... ఇక్కడా విలన్‌ పాత్రనుద్దేశించి ఈ టైటిల్‌ పెట్టారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు