రామ్‌ చరణ్‌ జాగ్రత్త పడ్డాడు

రామ్‌ చరణ్‌ జాగ్రత్త పడ్డాడు

'వినయ విధేయ రామ' విడుదల కాకముందే దాని ఫలితాన్ని చరణ్‌ గెస్‌ చేసాడట. అయితే విడుదలయ్యే వరకు సినిమాపై తనే ఆసక్తి లేనట్టు వుంటే కోట్లు పెట్టి కొన్న వారు బాగా నష్టపోతారని ప్రమోషన్స్‌ మాత్రం ఎలాంటి అభ్యంతరం లేకుండా చేసాడట. వినయ విధేయ రామ కథ ఎంత సుత్తిగా వున్నా కొన్ని చెత్త సన్నివేశాలుండడం మాత్రం ట్రోలింగ్‌కి గురయింది. ముఖ్యంగా ట్రెయిన్‌పై నిలబడి జర్నీ చేసేది బాగా నవ్వుల పాలయింది. ఆ సీన్లు తొలగించమని బోయపాటి శ్రీనుకి ఎంత చెప్పినా బాగుంటాయని, ఖచ్చితంగా సినిమాకి ప్లస్‌ అవుతాయని కన్విన్స్‌ చేయడానికే ట్రై చేసాడట.

ఊహించినట్టుగానే ఆ సన్నివేశం నవ్వుల పాలు అవడంతో రెండవ రోజునుంచి థియేటర్లలో ఆ సీన్‌ తొలగించారు. ఆ సీన్‌ కనుక అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అయితే అది ఎప్పటికీ ట్రోలర్స్‌కి మెటీరియల్‌గా మిగిలిపోతుందని భావించి అమెజాన్‌లో విడుదల చేసేముందే 'వినయ విధేయ రామ' రీ ఎడిట్‌ చేయించారట. ఆ సన్నివేశంతో పాటు అతిగా వున్న రెండు మూడు సీన్లు తీసేసి డ్యామేజ్‌ తగ్గించారట. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బిజీ అయిపోయినా కానీ ఈ చిత్రం వల్ల జరిగే పర్మినెంట్‌ డ్యామేజ్‌ సంగతి గ్రహించి చరణ్‌ ముందుగా జాగ్రత్త పడడాన్ని మెగా ఫాన్స్‌ హర్షిస్తున్నారు. ఇకపై అతను ఇలాంటి చిత్రాలు చేయనే చేయకూడదని ఇటీవలే అభిమానులు పర్సనల్‌గా కలిసి విన్నవించుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English