ఎన్టీఆర్‌ ఇవ్వలేదు... కళ్యాణ్‌ ఇస్తాడా?

ఎన్టీఆర్‌ ఇవ్వలేదు... కళ్యాణ్‌ ఇస్తాడా?

నిత్యామీనన్‌ తర్వాత ఆమెలా పాపులర్‌ అవుతుందని నివేదా థామస్‌ గురించి మొదట్లో భావించారు. నానితో జెంటిల్‌మేన్‌, నిన్నుకోరి చిత్రాలతో వరుసగా విజయాలు అందుకుని సరాసరి జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసింది. అయితే 'జై లవకుశ' అంతా ఎన్టీఆర్‌ డామినేషన్‌ అయిపోవడంతో అందులో నటించిన హీరోయిన్లకి ఏమీ కలిసి రాలేదు. దాంతో ఆ చిత్రం తర్వాత టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ల రేసులోకి వెళ్లవచ్చునని ఆశించిన నివేద కెరియర్‌కి బ్రేకులు పడ్డాయి. అవకాశాలు తగ్గిన దశలో ఆమెకి '118'లో ఛాన్స్‌ వచ్చింది.

ఈ చిత్రంలో ఆమె నటన చాలా బాగుంటుందని, ఒక సీన్‌లో ఆమె నటనకి తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయని ఎన్టీఆర్‌ కితాబిచ్చాడు. నటిగా ఆమె టాలెంట్‌ ఏమిటనేది ఇంతకుముందే రుజువయింది. అయితే మరిన్ని అవకాశాలు వచ్చే పెద్ద బ్రేకే ఇంతవరకు లభించలేదు. మరి 118తో అయినా నివేద నిచ్చెన ఎక్కగలుగుతుందా లేదా చూడాలి. ఈ చిత్రంలో ఆమెతో పాటు 'అర్జున్‌రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండే కూడా నటించింది. ఈ చిత్ర విజయం కళ్యాణ్‌రామ్‌కి ఎంత కీలకమో నివేదా థామస్‌కి కూడా అంతే కీలకమని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English