సైరా అండ్ సాహో.. మీటింగ్ పెట్టాల్సిందే

సైరా అండ్ సాహో.. మీటింగ్ పెట్టాల్సిందే

టాలీవుడ్ లో ఈ ఏడాది 400 కోట్లతో ఇద్దరు హీరోలు భారీ ప్రయోగమే చేస్తున్నారు. నాలుగు కోట్ల నుంచి మొదలైన పారితోషికాలు పదుల సంఖ్యలో దాటేస్తున్నాయు. వందల కోట్లల్లో వ్యాపారం గనుక కాస్త ఆచి తూచి అడుగు వేయడం ఇప్పుడు టాలీవుడ్ కి చాలా అవసరం. బాలీవుడ్ సైతం ప్రయోగాలు చేయని విధంగా ఇన్వెస్ట్మెంట్ తో టాలీవుడ్ ఆడుతున్న ఈ డేంజరస్ గేమ్ లో మనకు మనమే పోటీ అయితే మరోసారి ఎవరు బాలీవుడ్ ని బీట్ చేయలేరు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని సైరా అండ్ సాహో చిత్ర నిర్మాతలు పెద్ద ఆలోచనలో పడ్డారు. ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా ఈ ఏడాది ఆగస్టులో రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఆల్రెడీ ప్రకటించేసింది. ఇక సైరా మొన్నటివరకు వచ్చే సంక్రాంతికి రావచ్చని టాక్ వచ్చింది. కాకపోతే రామ్ చరణ్ వీలైనంత త్వరగా రిలీజ్ చెయ్యాలని వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో సినిమా షూట్ అంతా ముగిసిపోనుందట. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ ఒక్కటే పెండింగ్ లో ఉంటాయి. కాబట్టి ఆగస్టు 15న సైరా వచ్చేయడానికి దాదాపు స్టేజీ రెడీ అంటున్నారు సన్నిహితులు.

అయితే సాహో అండ్ సైరా క్లాష్ అయితే ఎవ్వరికీ లాభం రాదు కాబట్టి.. ఇప్పుడు రామ్ చరణ్ తో సిట్టింగ్ కు ప్లాన్ చేస్తోంది యువి టీమ్. వీలైనంత వరకు సైరా కాస్త పోటీ నుంచి వెనకడుగు వేస్తే ఇద్దరికి మంచిదని చరణ్ తో మంతనాలు జరపనున్నట్లు సమాచారం. సైరా సినిమా 200 కోట్ల బారి బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక సాహో కి అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. ఇప్పుడు రెండు కూడా ఆగస్టు 15న రావడానికి సిద్దపడితే.. ఖచ్చితంగా ఇద్దరూ నష్టపోతారు.  మరి ఈ క్లాష్ ను కక్యాన్సిల్ చేయడానికి నిర్మాణ సంస్ధలు ఏ విధంగా ముందుకు వెళతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English